e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News samantha | కండీషన్స్ పెడుతున్న సమంత.. వాటికి ఓకే అంటేనే సినిమాకు సై..

samantha | కండీషన్స్ పెడుతున్న సమంత.. వాటికి ఓకే అంటేనే సినిమాకు సై..

samantha | samantha naga chaitanya
samantha

Samantha conditions | సినిమా కెరీర్‌కు వ్యక్తిగత జీవితానికి అస్సలు సంబంధం లేదు. వ్య‌క్తిగ‌త‌ జీవితంలో జరిగే సంఘటనలు కెరీర్‌ను పెద్దగా ప్రభావితం చేయవు. గతంలో ఇది చాలామంది విషయంలో నిరూపితమైంది. ఇప్పుడు సమంత విషయంలో కూడా ఇదే జ‌రుగుతుంది. నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఈమె కెరీర్ సజావుగా సాగుతుంది. నిజానికి నాగ చైతన్య కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ ఇద్దరిపై విడాకుల ప్రభావం ఏ మాత్రం పడలేదు. కాకపోతే ఇప్పుడు సమంత ఒప్పుకునే సినిమాలకు కొన్ని కండీషన్స్ పెడుతుంది. వాటికి సరే అంటేనే సినిమా సైన్ చేస్తుంది ఈ మాజీ అక్కినేని కోడలు. ముందే చెప్పాలనుకున్న కండీషన్స్ నిర్మాతలకు చెప్పేస్తుంది. అవన్నీ ఓకే అన్న తర్వాత మిగిలిన వివరాలు మాట్లాడుకుంటుంది సమంత.

స‌మంత‌ కండీషన్స్ ( Samantha conditions ) కూడా పెద్దగా ఇబ్బంది పెట్టేలా లేకపోవడంతో నిర్మాతలు కూడా సరే అంటున్నారు. ప్రస్తుతం గుణశేఖర్ శాకుంతలం ( Shaakuntalam ) సినిమాలో నటిస్తోంది సమంత. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల కింద పూర్తయింది. దీంతో పాటు తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా సమంత ఒక హీరోయిన్. ఇందులో నయనతార మరో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా మరో రెండు సినిమాలు ఒప్పుకుంది సమంత. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మించనున్న 30వ సినిమాలో నటించబోతుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శాంతరూబన్‌ జ్ఞానశేఖరన్‌ తెరకెక్కించబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రాబోతుంది. ఈ విషయాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

- Advertisement -

అలాగే శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తోన్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంలోనూ సమంత నటించనుంది. ఈ సినిమా కోసం ఏకంగా 3 కోట్ల రెమ్యునరేషన్ సమంత తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి హరి, హరీశ్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించబోతున్నారు. నవంబర్‌ నుంచి షూటింగ్‌ మొదలు కానుంది. తను ఒప్పుకుంటున్న సినిమాల షూటింగ్ కేవలం చెన్నై, ముంబై పరిసర ప్రాంతాల్లోనే పెట్టాలని నిర్మాతలకు కండీషన్ పెడుతుంది సమంత. ఒకవేళ అలా కుదరని పక్షంలో హైదరాబాద్‌లో షూటింగ్ చేయాల్సి వస్తే కేవలం ఇండోర్ పెట్టాలని కోరుకుంటుంది. తన కండీషన్స్ కు ఓకే చెప్తే సినిమాలకు సైన్ చేస్తోంది సమంత. వీటికి నిర్మాతలు కూడా పెద్దగా ఇబ్బంది లేకుండానే ఒప్పుకుంటున్నారు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత హైదరాబాద్ లో షూటింగ్ చేయడానికి సమంత మనసు ఒప్పుకోవడం లేదని సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Preetham: ఆగ‌ని మాట‌ల దాడి.. చైతూ స్పందించాల‌ని కోరుతున్న స‌మంత స్టైలిస్ట్

Naga Chaitanya: కొత్త అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన చైతూ.. సింగిల్‌గా ఉండ‌నున్నాడా..!

Samantha | అక్కినేని ఫ్యామిలీ కోసం స‌మంత అన్ని త్యాగాలు చేసిందా?

Samantha : స‌మంత త‌ల్లి కావాలని అనుకుంది, కానీ.. శాకుంత‌లం నిర్మాత షాకింగ్ కామెంట్స్

Samantha : స‌మంత ఒంటిపై మూడు టాటూలు.. వాటి అర్ధం ఏంటో తెలుసా?

Samantha | అమ్మో స‌మంత అంత‌ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుందా?

Samantha | క‌నిక‌రం లేకుండా నాపై దాడి..న‌న్ను ఒంటరిగా వ‌దిలేయండి : స‌మంత‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement