పదేళ్లు సమంత ప్రేమలో ఉన్న నాగ చైతన్య 2017లో ఆమెను వివాహం చేసుకున్నాడు. మూడేళ్ల పాటు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. సడెన్‌గా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో అక్టోబర్ 2న తాము విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఇక నుండి మేము స్నేహితుల్లానే ఉంటాం అని తెలియజేశారు.
విడాకులకి ముందు చై-సామ్ గచ్చిబౌలిలోని ఓ అపార్ట్ మెంట్ లో నివసించేవారు. అది సమంతది అని సమాచారం. చైతూ జూబ్లిహిల్స్‌లో భారీ ఖర్చుతో బంగ్లా కొనుగోలు చేయగా, ప్రస్తుతం దానికి దాని రెనొవేషన్ వర్క్ జరుగుతుంట. ఇది పూర్తి కావడానికి దాదాపు ఏడాది పడుతుంది. ఆ ఇంటి పని పూర్తయ్యాక చైతూ సమంతతో కలిసి అందులోకి మారుదామని అనుకున్నాడు.
కాని సడెన్‌గా సమంత- చైతూలు విడిపోవడంతో సమంత తన అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటుండగా, నాగ చైతన్య విలాసవంతమైన హోటల్లో ఉంటున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే తను కొనుగోలు చేసిన అపార్ట్మెంట్ పూర్తి కావడానికి ఏడాది కానున్న నేపథ్యంలో చైతూ నగరంలోనే ఓ పోష్ ఏరియాలో మరో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.