Samantha | కనికరం లేకుండా నాపై దాడి..నన్ను ఒంటరిగా వదిలేయండి : సమంత
టాలీవుడ్ (Tollywood) సెలబ్రిటీ కపుల్ సమంత (Samantha), నాగచైతన్య (Naga Chaitanya) విడాకుల అంశం కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. తనపై వస్తున్న వార్తలకు సమాధానంగా సోషల్ మీడియా ద్వారా సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది సామ్.

టాలీవుడ్ (Tollywood) సెలబ్రిటీ కపుల్ సమంత (Samantha), నాగచైతన్య (Naga Chaitanya) విడాకుల అంశం కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. చైతూ, సామ్ విడిపోవడంపై ఈ ఇద్దరు యాక్టర్ల ఫాలోవర్లు, నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. అయితే వ్యక్తిగతంగా సమంతను చాలా మంది విమర్శించడం మొదలుపెట్టారు. తనపై వస్తున్న వార్తలకు సమాధానంగా సోషల్ మీడియా ద్వారా సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది సామ్. వ్యక్తిగత సంక్షోభంలో మీ భావోద్వేగ వ్యాఖ్యలు, నాపై చూపిన సానుభూతి, నా విషయం పట్ల వ్యక్తం చేసిన ఆందోళన, తప్పుడు పుకార్లు, కథనాల నుండి రక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.
కొందరు నాకు ఎఫైర్స్ ఉన్నాయంటున్నారు. పిల్లలు వద్దనుకుంటున్నానని చెబుతున్నారు. నేను అవకాశవాదినని అంటున్నారు. ఇప్పుడేమో అబార్షన్ (Abortion) చేయించుకున్నానని అంటున్నారు. విడాకుల ప్రక్రియ అనేది వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది పెట్టే అంశం. ఆ బాధ నుంచి బయటపడేందుకు నన్ను దయచేసి ఒంటరిగా వదిలేయండి. కనికరం లేకుండా వ్యక్తిగతంగా నాపై దాడి చేస్తున్నారు. నేను ఇలాంటి విషయాన్ని అనుమతించను..అంటూ పోస్టులో చెప్పుకొచ్చింది. విడాకుల తర్వాత సమంత తన ఆవేదనను చెబుతూ పెట్టిన ఈ పోస్టు ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

మా శ్రేయోభిలాషులకు చెప్తున్నదేమంటే.. చాలా చర్చల తర్వాత చైతన్య, నేను భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా సొంత మార్గాల్లో వెళ్లాలనుకుంటున్నాం. దశాద్దానికిపైగా మా ఇద్దరి మధ్య స్నేహం ఉండటం చాలా అదృష్ణం. మా ఇద్దరి రిలేషన్ షిప్లో ప్రత్యేక అనుబంధం ఉందని నమ్ముతున్నాం. మా అందరికీ మీ మద్దతుంటుందని ఆశిస్తున్నామంటూ విడిపోతున్న సందర్భంగా పోస్ట్ పెట్టింది సామ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Seetimaarr | ఓటీటీలో ‘సీటీమార్’ ఈల వేసేది అప్పుడే..!
Konda Polam movie Review | కొండపొలం రివ్యూ
Chiranjeevi: కుటుంబంతో కలిసి ‘కొండ పొలం’ వీక్షించిన చిరంజీవి.. కామెంట్ ఏంటి?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

