Samantha | అమ్మో సమంత అంత రెమ్యునరేషన్ తీసుకుంటుందా?

Samantha remuneration | తెలుగు ఇండస్ట్రీలో సమంతకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అక్కినేని కోడలు అయిన తర్వాత అది మరింత పెరిగింది. ఆ ఇమేజ్ కాస్త అభిమానుల్లో గౌరవంగా మారింది. అందుకే పెళ్లి తర్వాత ఆమెకు ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే వచ్చాయి. అంతకు ముందు బాగా గ్లామర్ క్యారెక్టర్స్ చేసినా కూడా.. పెళ్లి తర్వాత మాత్రం ఎక్కువగా నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసింది. దాంతో పాటు గ్లామర్ క్యారెక్టర్స్ కూడా చేసింది సమంత. ఫ్యామిలీమ్యాన్ 2 లో ఈమె చేసిన బెడ్ రూమ్ సీన్స్ సంచలనం సృష్టించాయి. నాగ చైతన్యతో విడాకులకు ఇది కూడా ఒక ప్రధాన కారణమని తెలుస్తోంది. తనకు కండిషన్స్ పెట్టినా.. ఒక పరిధి వరకు పరిమితం చేయడానికి ప్రయత్నించినా కూడా నచ్చదనే కారణంతోనే.. సమంత విడాకుల వరకు వచ్చిందని ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే ఇలా విడాకులు తీసుకున్న తరువాత కూడా డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈమెతో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు ఈమె తన తర్వాత సినిమా కోసం ఎవరూ ఊహించని స్థాయిలో సమంత రెమ్యునరేషన్ అందుకుంటుంది. ఇప్పటి వరకు తెలుగులో మరో హీరోయిన్‌కు కూడా సాధ్యం కాని స్థాయిలో 3.5 కోట్ల రెమ్యునరేషన్ సమంత అందుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించబోయే ఈ సినిమాను ఒక కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో వస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా 3.5 కోట్ల పారితోషకం అందుకుంటుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.
ఇదేగాని నిజమైతే ఇంతకంటే సంచలనం మరొకటి ఉండదు. చాలా సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్న శివలెంక కృష్ణప్రసాద్.. ఈ మధ్య కాలంలో ఇంద్రగంటి తెరకెక్కించిన నాని జెంటిల్ మెన్, సమ్మోహనం సినిమాలు నిర్మించారు. ఇప్పుడు సమంతతో సినిమా నిర్మించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం తెలుగులో గుణశేఖర్ శాకుంతలం.. తమిళంలో విజయ్ సేతుపతి సినిమాలతో బిజీగా ఉంది సమంత. ఏదేమైనా విడాకుల తర్వాత కూడా కెరీర్‌పై ఫోకస్ ఏ మాత్రం తగ్గనివ్వడం లేదు స్యామ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samantha | ఎన్టీఆర్ తో సమంత సందడి ..క్రేజీ అప్ డేట్..!
Samantha: పెళ్లి రోజు పోస్ట్ పెట్టిన సమంత.. అందులో ఏం చెప్పిందంటే..!
Pawan kalyan | సాయి ధరమ్ తేజ్ దర్శకుడికి పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్
Bheemla Nayak: భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ దూకుడుకి షాక్ అవుతున్న సినీ వర్గాలు
షారూఖ్ పార్టీలో బాలీవుడ్ స్టార్ల భార్యలు డ్రగ్స్ తీసుకున్నారు: షెర్లిన్ చోప్రా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

