సమంత- చైతూ విడాకుల వ్యవహారం వెనుక సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్ ఉన్నాడని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. సోదరభావంతో చూసే ప్రీతమ్‌తో సంబంధం ఉందని రాయడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిన పుకార్లు ఆగడం లేదు. తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడిన ప్రీతమ్.. తనపై వస్తున్న రూమర్స్‌పై నాగ చైతన్య స్పందిస్తే ఇవి ఆగుతాయని అనుకుంటున్నాను అని తెలిపారు.
సమంతను నేను అక్కా అని పిలుస్తా. ఈ విషయం చాలా మందికి తెలుసు. నాగ చైతన్యకు కూడా తెలుసు. సమంతకు, నాకు మధ్య ఉన్న అనుబంధం గురించి చైతన్యకు స్పష్టంగా తెలుసు. నాకు, సమంతకు ఎఫైర్ ఉందని వస్తున్న కామెంట్ల గురించి నాగచైతన్య స్పందించకపోవడం చాలా బాధ కలిగిస్తోంది. ఆయన ఒక్క స్టేట్మెంట్ ఇస్తే పరిస్థితిలో చాలా మార్పు వస్తుంది అని ప్రీతమ్ అన్నారు.
సమంత డైవర్స్ తర్వాత చాలా మంది బూతులు తిడుతూ మెసేజ్‌లు చేస్తున్నారు. సమంతతో తను రిలేషన్ షిప్ లో ఉన్నానని భావిస్తున్న కొందరు ఫ్యాన్స్ తనను చంపుతానంటూ బెదిరిస్తున్నారని అన్నాడు ప్రీతమ్. ఇప్పటికే తనను బండ బూతులు తిడుతున్నారని, కెరీర్ ను నాశనం చేస్తామంటూ చాలామంది హెచ్చరిస్తున్నారని తెలిపిన ప్రీతమ్.. ఓ దశలో తన తల్లి చనిపోయినట్టు కూడా వెబ్ సైట్స్ లో రాశారని బాధపడ్డాడు.