టాలీవుడ్ (Tollywood) యువ హీరో అడివి శేష్ (Adivi Sesh) లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం మేజర్ (Major). 26/11 ముంబై ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా వస్తున్న మేజర్ చిత్రాన్ని శశి కిరణ్ టిక్కా (Sashi Kiran Tikka) డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ప్రేక్షకులకు అందుబాటు ధరల్లో ఉండేలా టికెట్లు ధరలు ఉంటాయని మేజర్ టీం ప్రకటించింది. టికెట్ ధర రూ.150 మించి ఉండదని వెల్లడించింది. అయితే దీనికి విరుద్దంగా ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లోని సంధ్య 70 ఎంఎంలో బాల్కనీ టికెట్లను రూ.175కి అమ్ముతున్నారని ఓ నెటిజన్ అడివిశేష్కు ట్వీట్ చేశాడు.
ఆ నెటిజన్ ట్వీట్ చేసిన రెండు గంటల్లోనే స్పందించిన అడివిశేష్..ఈ విషయాన్ని సంథ్య థియేటర్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి..సమస్యను పరిష్కరించాడు. సంధ్య 35 ఎంఎం యాజమాన్యానికి రిక్వెస్ట్ చేశా. వాళ్లు రూ.150కే టికెట్ ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. మా కృషికి సాయం చేస్తున్న థియేటర్లకు ధన్యవాదాలు. మేజర్ సినిమాను ప్రతీ ఒక్కరి చేరువయ్యేలా అందుబాటు ధరలో చూపించాలనుకుంటున్నాం..అని ట్వీట్ చేశాడు.
జూన్ 3న దేశవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతుంది మేజర్. ఈ మూవీలో బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ (saimanjrekar) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సోనీ పిక్చర్స్ ఇండియా, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహేశ్ బాబు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు.
They have assured me that they will change the price. They will also refund the excess money collected. As said before, it’s about reaching everyone’s ❤️ heart#MajorOnJune3rd Let’s do this🇮🇳 https://t.co/YYDKPyCEjk
— Adivi Sesh (@AdiviSesh) May 31, 2022