Hyderabad | హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో ఓ తాగుబోతు ఆటోడ్రైవర్ వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న అతని ఆటోను పోలీసులు సీజ్ చేయడంతో రెచ్చిపోయాడు. ఆటోలో నుంచి పామును తీసుకొచ్చి పోలీసులపై బెదిరింపులకు దిగాడు.
పాతబస్తీ పరిధిలోని చాంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్‌ను ఆపి పరీక్షించగా రీడింగ్ 150 వచ్చింది. దీంతో ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆటోను సీజ్ చేశారు. అప్పుడు తన సామగ్రి ఉందంటూ ఆటో వద్దకు వెళ్లిన డ్రైవర్.. వెంటనే అందులో నుంచి ఒక పామును తీసుకొచ్చాడు. దాన్ని చేతికి చుట్టుకుని పోలీసులను బెదిరిస్తూ హల్చల్ చేశాడు. అప్రమత్తమైన పోలీసులు అదును చూసి అతన్ని పట్టుకునేలోపే.. పాముతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు.
Drunk Auto Driver Triggers Chaos at #Chandrayangutta by Threatening Cops with Snake
Tension prevailed at the Chandrayangutta crossroads in #Hyderabad’s Old City on Friday during a routine drunk-driving enforcement drive, after an auto-rickshaw driver created chaos by threatening… pic.twitter.com/HGcsuVdcDE
— BNN Channel (@Bavazir_network) January 4, 2026