Shahrukh Khan | మీడియాకు దూరంగా స్టార్ హీరో..కారణమేంటో..?
తన కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan drug case) డ్రగ్స్ కేసులో చిక్కడంతో కొంతకాలంగా కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు షారుక్ ఖాన్ (Shahrukh Khan). . ఆ తర్వాత ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ రాగానే కొంత రిలాక్స్ అయ్యాడు.
బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోల్లో ఒకడు షారుక్ ఖాన్ (Shahrukh Khan). తన కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan drug case) డ్రగ్స్ కేసులో చిక్కడంతో కొంతకాలంగా కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ రాగానే కొంత రిలాక్స్ అయ్యాడు. అయితే ఒకానొక టైంలో ఓ సెక్షన్ ఆఫ్ మీడియా వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాడు షారుక్ ఖాన్. ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత షారుక్ మీడియాను పక్కన పెడుతూ వస్తున్నాడు.
బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు అలియాభట్-రణ్ బీర్‌కపూర్ వెడ్డింగ్, కరణ్ జోహార్ 50వ బర్త్ డే వేడుకల్లో కూడా ఎక్కడా మీడియా కంట పడకపోవడం చాలా అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చక్కర్లు కొడుతుంది. ఈ రెండు కార్యక్రమాల్లో షారుక్‌ఖాన్ సీక్రెట్‌గా వచ్చి పార్టీకి హాజరై వెళ్లేలా ఏర్పాట్లు చేశారట. ప్రస్తుతం ఈ స్టార్ హీరో మీడియా ముందు ( meet the press ) కు వచ్చే మూడ్‌లో లేడని, రానున్న కాలంలో ప్రెస్ మీట్లకు వీలైనంత దూరంగా ఉండాలని ఫిక్స్ అయినట్ట బీటౌన్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.
ఈ స్టార్ హీరో ప్రస్తుతం సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో దీపికాపదుకొనే, జాన్ అబ్రహాంతో కలిసి పఠాన్ చిత్రంలో నటిస్తున్నాడు. దీంతోపాటు స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో కలిసి డుంకీ (Dunki) సినిమా చేస్తున్నాడు. మొత్తానికి ఆర్యన్ ఖాన్ కేసు వ్యవహారం వల్లే షారుక్ ఇలా మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతున్నాడని అంటున్నారు బీటౌన్ జనాలు. సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ లోనైనా షారుక్ ప్రెస్ ముందుకు వస్తాడా..? లేదా..? అనేది చూడాలి.
Read Also : Chiru 154 | చిరంజీవి-బాబీ సినిమా షెడ్యూల్‌పై క్రేజీ అప్ డేట్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bollywood
- media
- Shahrukh khan
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

