టాలీవుడ్ (Tollywood) మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టు ఎఫ్3 (F3) ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. ఎప్పటిలాగే ఎలాంటి లాజిక్స్ వెతుక్కోకుండా..జస్ట్ నవ్వుకుని ఫన్ టైంను ఎంజాయ్ చేసేలా సినిమా తీశాడు. సిల్వర్ స్క్రీన్‌పై విక్టరీ వెంకటేశ్ (Venkatesh), వరుణ్ తేజ్ (Varun Tej), తమన్నా (Tamannaah), మెహరీన్ కౌర్ (Mehreen Kaur)తోపాటు మిగిలిన యాక్టర్లంతా..తమ తమ పాత్రల మేరకు ఎంటర్టైన్ మెంట్ అందించే ప్రయత్నం చేశాడు అనిల్ రావిపూడి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయిందనే చెప్పొచ్చు.
మేకర్స్ ముందుగా చెప్పినట్టు ఈ చిత్రానికి రిపీటెడ్ ఆడియెన్స్ వస్తున్నానని తాజా టాక్. ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా ఎఫ్ 3 ఫన్ రైడ్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టు ఈ సినిమా కలెక్షన్ల విషయంలో వచ్చిన అప్డేట్ చెప్పేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్ 3 మొత్తం రూ.18..77 కోట్లు షేర్ రాబట్టింది. మే 27న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి కలెక్షన్లు (F3 Collections) రాబట్టిందో ఓ లుక్కేస్తే..
తెలంగాణ, ఏపీలో కలెక్షన్లు ప్రాంతాల వారీగా..
నైజాం-రూ.8.16 కోట్లు
యూఏ-రూ.2.23 కోట్లు
సీడెడ్-రూ.2.41కోట్లు
నెల్లూరు-రూ.0.86 కోట్లు
ఈస్ట్-రూ.1.28 కోట్లు
వెస్ట్-రూ.1.23 కోట్లు
కృష్ణా-రూ.1.18 కోట్లు
ఓవర్సీస్లోనూ హవా..
ఇక ఈ చిత్రం ఓవర్సీస్లోనూ బాక్సాపీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతుందని సమాచారం. తాజా అప్ డేట్ ప్రకారం 5.82 కోట్లకు పైగా రాబట్టినట్టు తెలుస్తోంది. మొత్తానికి రానున్న రోజుల్లో ఎఫ్ 3 వసూళ్ల రేంజ్‌ను మరింత పెంచుకుంటూ స్క్రీనింగ్అవడం గ్యారంటీ అంటున్నారు ట్రేడ్ పండితులు.
దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిశోర్, రాజేంద్రప్రసాద్, అలీ, రఘుబాబు, అన్నపూర్ణమ్మ, సోనాల్ చౌహాన్, ప్రగతి ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు.