Malayalam Movie | మలయాళ చిత్రసీమలో యువ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నివిన్ పౌలీ నటించిన తాజా చిత్రం ‘సర్వం మాయ’ . ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కామెడీ–హారర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాకు అఖిల్ సత్యన్ దర్శకత్వం వహించారు. రియా శిబు, ప్రీతి ముకుందన్, అజు వర్గీస్, జనార్దనన్, అల్తాఫ్ సలీం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. క్రిస్మస్ స్పెషల్‌గా విడుదలైన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. మోహన్ లాల్ నటించిన భారీ పాన్ ఇండియా మూవీ ‘వృషభ’తో పోటీగా థియేటర్లలోకి వచ్చినప్పటికీ, ‘సర్వం మాయ’ తనదైన కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించింది.
విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా, కేవలం పది రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటి సరికొత్త రికార్డులను సృష్టించింది. రోజురోజుకు ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుండటం ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ భారీ వసూళ్లన్నీ ఇప్పటివరకు మలయాళ వెర్షన్ నుంచే రావడం. ఇంకా ఇతర భాషల్లో విడుదల కాకపోయినా ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించడం విశేషంగా మారింది. ప్రస్తుతం సినిమాకు వస్తున్న స్పందనను చూసి, త్వరలోనే తెలుగు, తమిళం సహా ఇతర భాషల్లోనూ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
కథ విషయానికి వస్తే… ఈ చిత్రంలో నివిన్ పౌలీ ఓ గిటార్ ప్లేయర్‌గా కనిపిస్తాడు. అయితే సంగీతానికి డిమాండ్ తగ్గిపోవడంతో తన స్నేహితుడితో కలిసి పూజారి అవతారం ఎత్తుతాడు. దెయ్యాల సమస్యల నుంచి ఇళ్లను విముక్తి చేయడమే వారి పని. అలాంటి క్రమంలో ఒక ఇంటికి వెళ్లిన హీరోకు ‘మాయ’ అనే దెయ్యం పరిచయం అవుతుంది. ఆ మాయ ఎవరు? ఆమె గతం ఏమిటి? హీరో జీవితాన్ని ఆమె ఎలా మార్చింది? అన్నదే ఈ సినిమా కథాంశం. కథ సింపుల్‌గా ఉన్నప్పటికీ, దాన్ని తెరపై చూపించిన విధానం చాలా ఫ్రెష్‌గా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. కామెడీ, హారర్‌తో పాటు అవసరమైన ఎమోషన్‌ను మేళవిస్తూ దర్శకుడు అఖిల్ సత్యన్ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఈ కంటెంట్ బలం వల్లే ‘సర్వం మాయ’ మలయాళ ప్రేక్షకులనే కాకుండా, ఇతర భాషల ఆడియన్స్‌లోనూ ఆసక్తిని పెంచుతోంది. త్వరలోనే అన్ని భాషల్లో ఈ సినిమా విడుదలై మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.