Meenakshi Chaudhary | టాలీవుడ్ ప్రముఖ నటి, ‘సంక్రాంతికి వస్తున్నాం..’ మూవీ ఫేమ్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయానికి చేరుకున్న నటికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల నటిని చూసిన భక్తులు ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు.
Also Read..
L2 Empuraan | ఓటీటీలోకి వచ్చేసిన మోహన్ లాల్ ‘ఎల్2 ఎంపురాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.!
Prabhas | ప్రభాస్ సినిమాకి పహల్గాం టెర్రర్ ఎటాక్ సెగ.. ఇబ్బందుల్లో చిత్ర నిర్మాతలు