Prabhas | జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ అనే అందమైన ప్రదేశంలో ఉగ్రవాదులు దాడి ఎంత భయానకం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రెక్కింగ్‌ని ఇష్టపడే వారికి ఇది స్వర్గధామం కాగా, ఈ ప్రాంతంలో సడెన్ గా పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు జరపడంతో దాదాపు 28 మందికి చనిపోయారు. కుల మతాలకు అతీతంగా చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఉగ్రదాడిని ఖండించారు. అయితే… ఈ దాడి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఫౌజీ’ సినిమా వార్తల్లోకి వచ్చింది. అందుకు కారణం చిత్ర హీరోయిన్.
హను తెరకెక్కిస్తున్న ఫౌజీ సినిమాలో ప్రభాస్‌కి జతగా ఇమాన్వి అలియాస్ ఇమాన్ ఇస్మాయిల్ కథానాయికగా నటిస్తుంది.. సోషల్ మీడియాలో డాన్స్ వీడియోల ద్వారా మంచి ఫేమస్ అయిన ఇమాన్వి ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో అవకాశం దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే టెర్రర్ అటాక్ తర్వాత ఈమెపై కొందరు గుర్రుగా ఉన్నారు. అందుకు కారణం ఈవిడ విదేశాల నుండి ఇండియాకి వచ్చినప్పటికీ మూలాలు పాకిస్తాన్ దేశంలో ఉండడమే. పాక్ మాజీ మిలటరీ అధికారి కుమార్తె ఇమాన్వి కాగా, వీరి ఫ్యామిలీ ఢిల్లీలో స్థిరపడింది. జన్మతః పాక్ దేశస్థురాలు కావడంతో ఇప్పుడు ఆమెని ఫౌజీ సినిమా నుండి తీసేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాక్ పేరు కాని, ఆ దేశానికి చెందిన నటీనటుల పేరు కాని చెబితే గుర్రుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా నుంచి ఆవిడను తీసేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ ఎక్కువైంది. అయితే ఇప్పటికే సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది. ఈ సమయంలో హీరోయిన్ని మార్చడం అంటే నిర్మాతలకి చాలా పెద్ద సమస్య. ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ కావడం అంటే మామూలు విషయం కాదు. మరి ఈ సమస్యని ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి. కాగా, ఉగ్ర దాడులు జరిగినప్పుడు పాకిస్తానీ నటీనటులను హిందీ సినిమాల నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ వినిపించేది. హిందీ సినిమాలతో పాటు ఇప్పుడు తెలుగు సినిమాలకి సైతం ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ లభించడంతో టాలీవుడ్ లో కూడా పాక్ నటీనటులకి అవకాశం ఇవ్వొద్దనే డిమాండ్ ఎక్కువ అవుతుంది.