L2 Empuraan | మలయాళం నుంచి వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సాధించిన మోహన్ లాల్ ‘ఎల్ 2: ఎంపురాన్’ (L2: Empuraan) తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాలో మలయాళీ సూపర్ స్టార్, నటుడు మోహన్‌లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో నటించగా.. మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంజు వారియర్ (Manju Warrier), టోవినో థామస్(Tovino Thomas) కీలక పాత్రల్లో నటించారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఒకవైపు పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతునే మరోవైపు వివాదాల్లో చిక్కుకుంది. రీసెంట్గా ఈ చిత్రం రూ.250 కోట్లకు పైగా వసూళ్లను కూడా రాబట్టింది. అయితే ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్(Jio Hotstar)లో నేటి నుంచి ఈ చిత్రం తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
L2: Empuraan is now streaming only on JioHotstar@mohanlal @prithviofficial @GopyMurali @antonypbvr @gokulamstudios @aashirvadcine @LycaProductions @ManjuWarrier4 @ttovino @Indrajith_S @SaniyaIyappan_ @sujithvasudev @eriqebouaney @nylausha @JeromeFlynn @andreativadar… pic.twitter.com/GQoBbzDC2v
— JioHotstar Malayalam (@JioHotstarMal) April 23, 2025