Nani shyam singha roy | ఇండస్ట్రీలో ఎవరి టైం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం. 2017 వరకు ఎలాంటి సినిమా చేసినా సూపర్ డూపర్ హిట్ అందుకున్న నాని.. మూడేళ్లుగా సక్సెస్ కోసం ఇబ్బంది పడుతున్నాడు. ఆయన కెరీర్ పూర్తిగా డైలమాలో పడిపోయిందిప్పుడు. చేతినిండా సినిమాలున్నాయి కానీ సరైన విజయం అందక చాలా రోజులు అవుతుంది. 2015లో భలే భలే మగాడివోయ్ సినిమాకు ముందు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు నాని. అయితే అప్పుడు ఆయనకు ఇంత స్టార్డమ్ లేదు. అయినా కూడా వరుసగా అవకాశాలు దక్కించుకొని.. ఆ తర్వాత ఏకంగా 8 వరస విజయాలు అందుకొన్నాడు. కానీ 2018లో వచ్చిన కృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి నాని బ్యాడ్ టైం మళ్లీ మొదలైంది.
అదే ఏడాది నాగార్జునతో చేసిన మల్టీస్టారర్ దేవదాస్ అనుకున్న ఫలితం ఇవ్వలేదు. 2019లో ఈయన నటించిన జెర్సీ అద్భుతమైన విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలకు తోడు నేషనల్ అవార్డ్స్ కూడా తీసుకొచ్చింది. అయితే జెర్సీ తర్వాత మళ్లీ పాత కథే. భారీ అంచనాలతో వచ్చిన గ్యాంగ్ లీడర్ ఫ్లాప్ అయింది. 25వ సినిమా అంటూ ఎంతో హంగామా చేసిన ‘వి’ అభిమానులకు కూడా నచ్చలేదు. ఇక మొన్న విడుదలైన టక్ జగదీష్ పరిస్థితి కూడా అంతే. నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ అని అనుకునే ప్రేక్షకులు నమ్మకాన్ని మెల్లమెల్లగా కోల్పోతున్నాడు నాచురల్ స్టార్.
ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో వస్తున్నాడు. డిసెంబర్ 24న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మళ్లీ తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు నాని. అదే రోజు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని సినిమా కూడా విడుదల అవుతుంది. ఒక రకంగా నాని కెరీర్‌కు శ్యామ్ సింగరాయ్ చావో రేవో అన్నట్లుగా మారింది. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కిస్మస్, సాయిపల్లవి..ఈ కాంబినేషన్ నానికి ఎందుకు సెంటిమెంట్?
Nani Kriti Shetty lip lock | హాట్ టాపిక్‌గా నాని-కృతిశెట్టి లిప్‌లాక్ సీన్
ఇందుక్కాదూ.. అభిమానులంతా నిన్ను జై బాలయ్య అంటూ నెత్తిన పెట్టుకునేది..?
Shyam Singha Roy Story | నాని కంటే ముందు ‘ శ్యామ్ సింగరాయ్’ కథ విన్న హీరో ఎవరు..?
నానితో మూడోసారి జోడీ కడుతున్న సమంత.. అలాంటి పాత్రలో..
Sai pallavi | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి