ఇందుక్కాదూ.. అభిమానులంతా నిన్ను జై బాలయ్య అంటూ నెత్తిన పెట్టుకునేది..?

balakrishna and nani in unstoppable talk show | ఒక హీరోపై అభిమానులు కేవలం సినిమాలు చూసి మాత్రమే ఇష్టం పెంచుకోరు. ఆయన చేసే పనులు కూడా అభిమానం పెరిగేలా చేస్తాయి. నందమూరి బాలకృష్ణ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఈయన సినిమా ఎప్పుడు వచ్చినా కూడా అభిమానులు పండగ చేసుకుంటారు. మాస్ ఫాలోయింగ్‌లో బాలయ్య స్థాయి వేరు. ఆయనకు సరైన సినిమా పడితే ఇప్పటికీ బాక్సాఫీస్ బద్దలయిపోతుంది. మాస్ హిస్టీరియా అనే పదానికి బాలకృష్ణ ప్రత్యక్ష నిదర్శనం. ఈయన పేరు వింటే నందమూరి అభిమానులు ఊగిపోతారు. ఒక్కముక్కలో చెప్పాలంటే అభిమానులకు బాలయ్య పేరు ఒక తారక మంత్రం. అంతగా ఆయన ఏం చేస్తాడు.. ఎందుకు బాలకృష్ణ అంటే వాళ్లకు అంత అభిమానం.. దీనికి సమాధానం చెప్పడం చాలా సింపుల్.
బాలయ్య చేసే కొన్ని పనులు చూస్తుంటే ఎవరికైనా అతనిపై అభిమానం గుండెల్లో నుంచి వస్తుంది. ఇతర హీరోల అభిమానులు కూడా బాలయ్యను చూస్తే చిన్న పిల్లాడు అంటూ అభిమానిస్తారు. తాజాగా ఈయన unstoppable టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో వచ్చే అతిథులతో బాలకృష్ణ మాట్లాడుతున్న తీరు చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తాజాగా నాని ఎపిసోడ్ ప్రసారమైంది. ఇందులో తనకంటే ఇమేజ్‌లో ఎన్నో రెట్లు తక్కువైన నాచురల్ స్టార్ నానిని బాలకృష్ణ పరిచయం చేసిన తీరు.. అతని మాటలతో పొగడ్తల వర్షం కురిపించిన హీరో చూసిన తర్వాత అందరూ జైహో బాలయ్య జై బాలయ్య అంటున్నారు.

అంతేకాదు తనపై తానే సెటైర్లు వేసుకుంటూ తనలో ఉన్న మరో మనిషిని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు బాలకృష్ణ. ఎపిసోడ్ అంతా నాని గొప్పతనం గురించి చెబుతూనే ఉన్నాడు బాలకృష్ణ. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. తాతలు తండ్రుల పేరు చెప్పకుండా సెల్ఫ్ మేడ్ ముద్ర వేసుకొని స్టార్ అయ్యాడు నాని అంటూ.. బాలయ్య చెప్పిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. అంత పెద్ద హీరో అయ్యుండి మరో హీరో గురించి ఎంత అద్భుతంగా మాట్లాడడానికి గొప్ప మనసు కావాలి.. ఎలాంటి భేషజాలు లేకుండా బాలయ్య అది చేసి చూపించాడు.. అందుకే అందరూ జై బాలయ్య అంటారు అంటూ సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Akhanda | ఈ విషయంలో బాలయ్య అంత రిస్క్ తీసుకుంటాడా..?
బాలయ్య, అల్లు అరవింద్ క్రేజీ కాంబినేషన్.. గీతా ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి నటసింహం సినిమా..?
Unstoppable: తేదేపా పగ్గాలు ఎందుకు తీసుకోలేదు అన్న ప్రశ్నకు బాలయ్య సమాధానం ఏంటి?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

