Akhanda | ఈ విషయంలో బాలయ్య అంత రిస్క్ తీసుకుంటాడా..?

akhanda movie release date | నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ సినిమాపై.. అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయేలా జరుగుతుంది. దాదాపు 60 కోట్ల వరకు బిజినెస్ జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. సినిమా ఎప్పుడు విడుదలైనా ఓపెనింగ్స్ అదిరిపోతాయి అని దర్శక నిర్మాతలు కూడా బలంగా నమ్ముతున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన రాలేదు. దీనిపైనే ఇండస్ట్రీలో గుసగుసలు నడుస్తున్నాయి. ఇప్పటివరకు ఎందుకు అఖండ సినిమా విడుదల తేదీని మేకర్స్ప్రకటించడం లేదంటూ నందమూరి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమా షూటింగ్ అయిపోయింది.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపు చివరి దశకు వచ్చేసింది.. అయినా కూడా ఇప్పటివరకు రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేదు. పైగా ప్రమోషన్స్ కూడా ఇంకా మొదలు పెట్టలేదు.
ఇప్పటి వరకు విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొన్న విడుదలైన టైటిల్ సాంగ్ అదరగొడుతుంది. నిజానికి ఆ పాటలోనే విడుదల తేదీ కూడా ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. అయితే అది జరగలేదు. నవంబర్ 15న అఖండ ట్రైలర్ విడుదల కానుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. మరోవైపు డిసెంబర్ 2న అఖండ సినిమాను విడుదల చేస్తారని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది. కానీ దీంతో పాటు డిసెంబర్ 17 కూడా అఖండ మేకర్స్ దృష్టిలో ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ రోజు అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
పుష్ప సినిమాతో బాలయ్య పోటీ పడతాడా.. ఒకవేళ పడితే రెండు సినిమాలకు భారీ నష్టం తప్పదు అంటూ లెక్కలు వేసుకుంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఒకే రోజు రెండు సినిమాలు విడుదల చేయడం మంచిది కాదు.. పైగా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ గాడిన పడుతున్న ఈ సమయంలో ఇద్దరు స్టార్ హీరోలు ఒకే రోజు రావడం శ్రేయస్కరం కాదు అంటున్నారు మిగిలిన నిర్మాతలు. పైగా బాలయ్య కూడా అఖండ సినిమా విషయంలో అంత రిస్క్ తీసుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ రావాలి అని ఫిక్స్ అయితే కచ్చితంగా బాలకృష్ణ ఎవరి మాటా వినడు. మరి చివరి వరకు ఈ రేస్ ఎలా ఉండబోతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
akhanda | అంచనాలు పెంచేస్తున్న బాలకృష్ణ అఖండ.. మరి విడుదల ఎప్పుడు..?
Balakrishna | బాలకృష్ణపై పవన్ కల్యాణ్ స్పీచ్ ఎఫెక్ట్..!
నా కార్ డిక్కీలో ఎప్పుడూ అది ఉండాల్సిందే..నానితో బాలకృష్ణ చమక్కులు
బాలకృష్ణతో కన్నడ హీరో ఢీ.. గోపీచంద్ స్కెచ్ మామూలుగా లేదుగా..
Unstoppable టాక్ షో కోసం బాలయ్యను అల్లు అరవింద్ అలా ఒప్పించాడా..?
బాలయ్య, అల్లు అరవింద్ క్రేజీ కాంబినేషన్.. గీతా ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి నటసింహం సినిమా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

