Balakrishna Unstoppable with Nani | నా కార్ డిక్కీలో ఎప్పుడూ అది ఉండాల్సిందే..నానితో బాలకృష్ణ చమక్కులు
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఎంత సరదాగా ఉంటాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. ఈ సారి గెస్ట్ గా నాని వచ్చాడు.

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఎంత సరదాగా ఉంటాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఆయన కోపం మాత్రం ఎప్పుడూ బయటికి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయనలో ఒక చిన్న పిల్లాడు దాగి ఉన్నాడు. అతనితో సన్నిహితంగా ఉన్న వాళ్లకే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి హీరోతో ఒక టాక్ షో చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన అల్లు అరవింద్ (Allu Aravind) కు వచ్చింది. అనుకున్నదే తడవుగా Unstoppable అంటూ ఒక షో మొదలుపెట్టి దాన్ని సూపర్ డూపర్ హిట్ చేశారు మెగా నిర్మాత. మొన్న దీపావళికి విడుదలైన మొదటి ఎపిసోడ్ రికార్డు వ్యూస్ అందుకున్నట్లు తెలుస్తోంది.
ఆహా మొదలుపెట్టి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ రెండేళ్లలో అత్యధిక వ్యూస్ సాధించిన టాక్ షో ఇదే అని తెలుస్తోంది. తాజాగా రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. ఈ సారి గెస్ట్ గా నాని వచ్చాడు. నాచురల్ స్టార్ గురించి బాలయ్య చెప్పిన మాటలు విని..అక్కడున్న అభిమానులే కాదు ప్రోమో చూసిన వాళ్లందరూ ఫిదా అయిపోయారు. ఇప్పుడు వచ్చే అతిథి మీ నుంచి వచ్చాడు..మీలో ఒకడిగా వచ్చాడు..సెల్ఫ్ మేడ్ అనే పదానికి అతడు నిదర్శనం అంటూ నాని (Nani) గురించి అద్భుతమైన ఇంట్రడక్షన్ ఇచ్చాడు బాలయ్య.
ఆ తర్వాత ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. ఒకరి సినిమా డైలాగులు ఒకరు చెప్పుకున్నారు. ఈగ సినిమాలోని అందరికీ పెట్టి నాకు మాత్రమే పెట్టలేదంటే నేను ఎంత స్పెషల్ అని బాలయ్య తన స్టైల్లో చెబితే.. ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు అంటూ నాని చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరూ సరదాగా క్రికెట్ ఆడారు. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని.. తన కారు డిక్కీలో ఎప్పుడూ ఒక క్రికెట్ కిట్ ఉంటుందని.. గాడ్ కూడా ఉంటుంది అని చెప్పాడు బాలకృష్ణ. ఒత్తిడి తగ్గించుకోవడానికి నువ్వేం చేస్తావ్ అని బాలయ్య అడిగితే సినిమాలు చూస్తాను అని చెప్పాడు నాని.

దాంతో వెంటనే నాతో పులిహోర కబుర్లు చెప్పొద్దు అంటూ సెటైర్లు వేశాడు బాలయ్య. రెండున్నర నిమిషాల ప్రోమోలో ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా సరదాగా బాలయ్య ఆకట్టుకున్నాడు. నవ్వుతూ మొదలు పెట్టి సీరియస్ డిస్కషన్ తో ప్రోమో ముగించారు. తన సినిమాలు ఎందుకు ఓటిటిలో విడుదలయ్యాయనే విషయంపై కూడా బాలయ్య షోలో వివరణ ఇచ్చాడు నాని. నవంబర్ 12న ఇది ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!
Laddunda lyrical promo | దరువేస్తూ బంగార్రాజు ‘లడ్డుందా’ సాంగ్ ప్రోమో
Rana: ఒక్క పోస్ట్‌తో ముగ్గురు సెలబ్రిటీలకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన రానా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

