Oscar 2027 : భారత దేశం నుంచి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ మరాఠి చిత్రం ‘గొంఢల్'(Gondhal) ఆస్కార్ 2027 బరిలో నిలిచింది. వచ్చే ఏడాది అకాడమీ అవార్డులకు ఈ సినిమా అధికారికంగా ఎంట్రీ సాధించింది. ఈ ఏడాది బ్లాక్బస్టర్ ‘ధురంధర్’ సిరీస్, ఇటీవలే వసూళ్లలో పుంజుకున్న ‘హనుమాన్ అంశ్’ చిత్రాలను వెనక్కి నెట్టిందీ మరాఠి థ్రిల్లర్. సంతోష్ దవాష్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 99వ అకాడమీ అవార్డుల్లో ‘బెస్ట్ ఇంటర్నేషన్ ఫీచర్ విభాగం’లో పోటీపడనుంది. ఈ విషయాన్ని భారతీయ చిత్ర సమఖ్య శుక్రవారం వెల్లడించింది.
వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డులకు భారత్ నుంచి మరాఠి చిత్రం గొంఢల్ ఎంపికైంది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ విభాగంలో ఈ సినిమా అధికారికంగా ఎంట్రీ సాధించింది. ఆస్కార్ నామినేషన్ కోసం దేశవ్యాప్తంగా మొత్తం 33 సినిమాలు పోటీపడ్డాయి. వీటిలో 14 హిందీ సినిమాలు ఉండగా.. తెలుగు నుంచి పెద్ది, ఇరుముడి, సింగ్ గీతం, ఎగ్వాలు రిజిష్టర్ అయ్యాయి.
VIDEO | Mumbai: Marathi film “Gondhal” has been chosen as India’s official entry to the Oscars, the Film Federation of India announced on Friday.
Written and directed by Santosh Davakhar, the film is set in rural Maharashtra and plays out over a night of a traditional ritual… pic.twitter.com/pGupRtyZib
— Press Trust of India (@PTI_News) September 18, 2026
ఇక గుజరాతీ, మరాఠి నుంచి నాలుగేసి చిత్రలు, తమిళం నుంచి మూడు, మలయాళం నుంచి ఒకటి, నగమెసె నుంచి ఒకటి.. ఒక సైలెంట్ ఫిల్మ్ ఉన్నాయి. చివరకు సంతోష్ దవాష్కర్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ కథాంశానికి జ్యూరీ ప్యానెల్ జై కొట్టింది. అణచివేతకు గురైన నవవధువు కథ ఇది. సంప్రదాయ గొంఢల్ ప్రదర్శన పట్ల తన భర్తకున్న అమితమైన ఇష్టాన్ని ప్రతీకారం తీర్చుకునేందుకు అనువుగా మలుచుకున్న తీరును ఓ థ్రిల్లర్గా తెరక్కించాడు సంతోష్. 2025లో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియాలో సిల్వర్ పికాక్ అవార్డు విజేత అతడు. 99వ ఆస్కార్ వేడుకలు 2027 మార్చి 14వ తేదీన లాస్ ఎంజెల్స్లోని డాల్బీ థియేటర్లో జరుగనున్నాయి.
Marathi film Gondhal has been chosen as India’s official entry to the Oscars 2027, the Film Federation of India announced on Friday.https://t.co/oWurmETJDi
— The Hindu (@the_hindu) September 18, 2026
హిందీ సినిమాలు – ధురంధర్, ధురంధర్ : ది రివెంజ్, డుగ్ డుగ్(రాజస్థానీ), హక్, 120 బహదూర్, 2020 ఢిల్లీ, గవర్నర్, ఇక్కిస్, ఒబెస్సే, అనుమాన్ అంశ్, తేరె మెరే నటా, ఓ మై డాగ్, కూంట, బార్డర్ 2.
తెలుగు – సింగ్ గీతం, ఇరుముడి, పెద్ది, ఎగ్వా
మరాఠి – గొంఢల్, లడూ, డియోల్ బ్యాండ్ 2, తిఘీ, మన్ అటాలే మనాట్లే.
తమిళ్ – బైసన్ కలామదాన్, కమాండో విన్ లవ్ స్టోరీ, దొరోతి.
కొన్యక్ – అంగ్
గుజరాతీ – బమర్దో, ప్రవాస్
నేపాలీ – షేప్ ఆప్ మొమో
మూకీ చిత్రం – గాంధీ టాక్స్
