కిస్మస్, సాయిపల్లవి..ఈ కాంబినేషన్ నానికి ఎందుకు సెంటిమెంట్?
By Maduri Mattaiah

ఈ క్రిస్మస్తో పాటు కథానాయిక సాయిపల్లవి కూడా నాకు సెంటిమెంట్ అంటున్నారు కథానాయకుడు నాని. ఆయన నటించిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబరు 24న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ విడుదల గురువారం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘కిస్మస్ నాకు చాలా స్పెషల్.. ఆ సీజన్లో ఎంసీఏతో పెద్ద విజయం సాధించాను.. అంతేకాదు ‘ఎంసీఏ’లో నటించిన సాయిపల్లవి కూడా ఈ చిత్రంలో హీరోయిన్ కావడం, ‘ఎంసీఏ’తో హిట్ అందుకున్న మా కాంబినేషన్లోనే ‘శ్యామ్ సింగరాయ్’ రావడంతో సెంటిమెంట్ పునరావృతం అవుతుందని అనుకుంటున్నాను. హిట్‌పెయిర్‌గా మా కాంబినేషన్లో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను.‘శ్యామ్‌సింగరాయ్’ ఇదొక భిన్నమైన ప్రేమకథ. ఈ కథలో హీరో అమ్మ తెలుగు మహిళ, నాన్న బెంగాలీ..ఈ కథ విన్నప్పుడే కొత్తదనం కనిపించింది.
ఈ చిత్రంలో కొత్త నానిని చూస్తారు, నా ఆహార్యంతో పాటు అన్ని కొత్త గా వుంటాయి. కథగా విన్న దానికంటే సినిమా చాలా బాగా వచ్చింది..సినిమాలో వున్న ట్విస్ట్‌లు ఎక్కువగా అర్థం కాకూడదనే టీజర్‌ను జాగ్రత్తగా కట్ చేశాం. టీజర్ కంటే సినిమా వందరెట్లు బాగుంటుంది. మీ అందరితో పాటు థియేటర్లో సినిమా చూడాలని ఎదురుచూస్తున్నాను.అందరి అంచనాల్ని సంతృప్తిపరిచేలా సినిమా ఉంటుంది’ అని తెలిపారు.
ఆకట్టుకునే సంభాషణలతో టీజర్: ‘అడిగే అండ లేదు..కలబడే కండ లేదని రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే..కాగితం కడుపు చీల్చుకుపుట్టి రాయడమే కాదు..కాలరాయడం కూడా తెలుసని అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే శ్యామ్‌సింగరాయ్’ అనే శక్తివంతమైన సంభాషణలతో టీజర్ ఆకట్టుకుంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

