Keerthy Suresh | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని (Sri Venkateswara Swamy Temple) అగ్ర కథానాయిక కీర్తి సురేశ్ (Keerthy Suresh) దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న నటికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో శేష వస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. కీర్తి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆమె స్వామివారిని దర్శించుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
#WATCH | Andhra Pradesh: Actor Keerthy Suresh and family offered prayers at Sri Venkateswara Swamy Temple in Tirupati. pic.twitter.com/2uyV1trk0S
— ANI (@ANI) November 29, 2024
మరోవైపు తన రిలేషన్షిప్ స్టేటస్‌పై కీర్తి సురేష్ బుధవారం అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రియుడు ఆంటోనీతో దీపావళి సందర్భంగా తీసుకున్న ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. తమ స్నేహబంధం జీవితాంతం కొనసాగనుందని తెలిపింది. ఈ వార్త తెలుసుకున్న పలువురు సినీ సెలబ్రిటీలు కీర్తి సురేష్‌కు శుభాకాంక్షలు అందజేశారు. వచ్చే నెల వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 11, 12 తెదీల్లో గోవా (Goa)లో గ్రాండ్ వెడ్డింగ్ జరగబోతోందంట. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలిసింది. అయితే, తమ మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి ఓపెన్ అయిన కీర్తి సురేశ్.. పెళ్లి గురించి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
Also Read..
Nayanthara | ఎలాంటి ఉల్లంఘనా జరగలేదు.. ధనుష్ లీగల్ నోటీసులపై స్పందించిన నయనతార లాయర్
Samantha | సిటాడెల్ సక్సెస్ పార్టీ.. బేబీ జాన్ పాటకు సామ్ – వరుణ్ ధావన్ స్టెప్పులు.. VIDEO
Naga Chaitanya – Sobhita | మొదలైన పెళ్లి సందడి.. నాగచైతన్య – శోభిత హల్దీ వేడుకలు