Saif Ali Khan | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడని తెలిసిందే. గురువారం తెల్లవారుజామున ముంబై బాంద్రాలోని సైఫ్ నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో దాడి చేయగా.. సైఫ్ అలీఖాన్ ఒంటిపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. ప్రస్తుతం ముంబైలోని లీలావతి దవాఖానాలో చికిత్స పొందుతున్నాడు సైఫ్ అలీఖాన్ . తాజాగా సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు నేడు బాంద్రాపోలీస్స్టేషన్లో నిందితుడిని ప్రశ్నిస్తున్నారు.
ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించడానికి దొంగలు ఫైర్ ఎస్కేప్ నిచ్చెనను ఉపయోగించారు. ఇది దోపిడీ ప్రయత్నం అని అనిపిస్తుందని ఇప్పటికే పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనపై దర్యాప్తు చేసే బాధ్యతను ప్రభుత్వం ప్రముఖ క్రైం బ్రాంచ్ అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్‌కు అప్పగించింది. ఈ నేపథ్యంలో క్రైమ్ బ్రాంచ్ అధికారులు, దయా నాయక్ బృందం ఇప్పటికే బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ ఇంటిని పరిశీలించింది.
కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఇంట్లోకి దొంగ ఎలా చొరబడ్డాడు? అనే అంశంతో పాటు సైఫ్‌పై దాడి చేసిన అనంతరం ఎలా తప్పించుకున్నాడు అనే కోణంలో దయా నాయక్ బృందం విచారణ చేయనుంది.
#WATCH | Saif Ali Khan Attack Case | Mumbai Police bring one person to Bandra Police station for questioning.
Latest Visuals pic.twitter.com/fuJX9WY7W0
— ANI (@ANI) January 17, 2025
Sankranthiki Vasthunnam Review | వెంకటేశ్ బ్లాక్ బస్టర్ కొట్టాడా..? సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ
Dhanush | బ్లాక్ బస్టర్ కాంబో రెడీ.. వెట్రిమారన్, ధనుష్ ఐదో సినిమా ఇదే అయి ఉంటుందా..?
Raja Saab | ప్రభాస్ రాజాసాబ్‌కు మాస్ ఆల్బమ్.. పాటలు ఎలా ఉంటాయో చెప్పిన థమన్