Gauri Spratt | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan).. ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడిన విషయం తెలిసిందే. బెంగళూరు (Bengaluru)కు చెందిన గౌరీ స్ప్రాట్ (Gauri Spratt) అనే మహిళతో కొన్నాళ్లుగా డేటింగ్లో ఉన్నాడు. ఇటీవలే తన 60వ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన ఆమిర్.. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ఈ క్రమంలో ఈ ప్రేమ జంట తాజాగా మరోసారి మీడియాతో ముచ్చటించింది.
ఈ సందర్భంగా ఆమిర్‌తో రిలేషన్ షిప్‌పై గౌరీ స్ప్రాట్ తొలిసారి స్పందించింది. తనకు లైఫ్ పార్ట్నర్గా ఆమిర్నే ఎందుకు ఎంచుకుందో వివరించింది. దయగల వ్యక్తి, జెంటిల్మెన్, తన పట్ల శ్రద్ధ వహించే వ్యక్తిని భాగస్వామిగా కోరుకున్నట్లు వివరించింది. ఆ క్వాలిటీస్ అన్నీ ఆమిర్‌లో గుర్తించినట్లు చెప్పింది. అందుకే తన లైఫ్ పార్ట్నర్గా అతడిని ఎంచుకున్నట్లు వెల్లడించింది. ఇక ఆమిర్ కూడా గౌరీని ఎంచుకోవడానికి గల కారణాన్ని వివరించాడు. ‘నేను ప్రశాంతంగా ఉండగలిగే, నాకు శాంతిని ఇచ్చే వ్యక్తి కోసం వెతుకుతున్నాను. ఆమె గౌరీనే అని అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చాడు.
1986లో రీనా దత్తాను పెళ్లి చేసుకున్న ఆమిర్.. 2002లో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ మహిళా డైరెక్టర్ కిరణ్ రావుతో ప్రేమలో పడి.. 2005లో పెళ్లిపీటలెక్కాడు. ఈ జంట కూడా 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గౌరీతో డేటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం తన ఆరేళ్ల కొడుకుతో కలిసి గౌరీ బెంగళూరులోనే ఉంటున్నది. ఈమె తల్లి కూడా సెలెబ్రిటీ స్టయిలిస్ట్. వీరికి బెంగళూరు, ముంబయి నగరాల్లో సెలూన్లు ఉన్నాయి. ఏడాదిన్నరగా డేటింగ్లో ఉన్న ఆమిర్ – గౌరి బంధానికి ఇరు కుటుంబాలు ఓకే చెప్పాయట. దాంతో.. తమ బంధం గురించి బయటపెట్టాడు ఆమిర్. “గౌరీ, నేను పాతికేళ్లుగా స్నేహితులం. ఏడాది కాలంగా ఇద్దరం డేటింగ్లో ఉన్నాం!” అంటూ ఆమిర్ వెల్లడించాడు.
Also Read..
“Gauri Spratt | ఎవరీ గౌరీ?.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ను ప్రేమలో ఎలా పడేసింది?”
“అరవైఏండ్ల వయసులో అమీర్ ప్రేమాయణం”
“Aamir khan| 60 ఏళ్ల వయస్సులో ఆమెతో అమీర్ ఖాన్ డేటింగ్… అసలు ఎవరు ఈ గౌరి స్ప్రాట్”
“Aamir Khan | 59 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో..?”