Aamir khan| బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నేటితో 60వ పడిలోకి అడుగుపెట్టారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అమీర్‌కి పలువురు ప్రముఖులు, అభిమానుల నుండి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అయితే అమీర్ ఖాన్ తన బర్త్ డే ముందు రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి గౌరీ స్ప్రాట్ అనే తన ఫ్రెండ్ తో సుమారు ఏడాదిన్నరగా డేటింగ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అంతేనా ఆమెతో కలిసి కేక్ కట్ చేసి అందరికి పరిచయం చేశారు. దీంతో ఈ గౌరీ స్ప్రాట్ ఎవరా అని, ఆమెకి ఇంతకముందు పెళ్లైందా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అభిమానులు.
కాగా, 2021లో ఆమిర్ ఖాన్ తన రెండో భార్య కిరణ్ రావ్‌తో వివాహ బంధానికి స్వస్తి పలికారు.ఇక అప్పటి నుండి అమీర్ ..గౌరీతో డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈమె ఇప్పుడు అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ లో పనిచేస్తోంది. గౌరీ తల్లి రీటా స్ప్రాట్ ఒక ప్రముఖ స్టైలిస్ట్ కాగా, తల్లి తమిళియన్. ఇక ఆమె తండ్రి ఐరిష్. బ్లూ మౌంటెన్ స్కూల్లో చదివిన గౌరీ.. ఫ్యాషన్ కోర్సు పూర్తి చేసింది. లండన్ యూనివర్సిటీలో ఎఫ్‌డీఏ స్టైలింగ్ అండ్ ఫొటోగ్రఫీలో ట్రైనింగ్ తీసుకున్న గౌరీకి గతంలో పెళ్లైనట్టు సమాచారం. గత కొంతకాలంగా గౌరీ ఆమిర్ ఖాన్ నిర్మాణ సంస్థలో సహాయకురాలిగా పని చేస్తుండగా, ఈ ఇద్దరి మధ్య 25 ఏళ్ల స్నేహం ఉంది. సుమారు 18 నెలల నుంచి వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారు.
గౌరీ తన భర్తతో కొన్నేళ్ల కిందట విడిపోయింది. వీరికి ఆరేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె ఇప్పుడు తన కొడుకుతో కలిసి జీవిస్తోంది. అయితే ప్రేయసిని కలిసేందుకు తాను ఎక్కువగా బెంగళూరుకి వెళుతుంటానని చెప్పాడు అమీర్. అక్కడ మీడియా అటెన్షన్ కాస్త తక్కువగా ఉన్న నేపథ్యంలో మా రిలేషన్ గురించి ఎవరికి తెలియదు. గౌరీ హిందీ సినిమాలు ఎక్కువగా చూడదని, తను నటించిన ‘లగాన్’, ‘దంగల్’, ‘దిల్ చాహ్తా హై’ మాత్రమే చూసిందని తెలిపాడు. తాను పాడే పాటలంటే గౌరీకి చాలా ఇష్టమని, అందుకే వీలుచిక్కినప్పుడల్లా తన కోసం సాంగ్స్ పాడుతుంటానని అమీర్ తెలియజేశాడు. ఇక ఆమెకి ఎఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశాడు ఈ మిస్టర్ పర్ఫెక్ట్. కాగా, అమీర్ ఖాన్ కు గతంలో రెండు పెళ్లిళ్లు అయిన విషయం తెలిసిందే. 1986లో రీనా దత్తాను పెళ్లాడిన అమీర్.. 2002లో ఆమెకు విడాకులిచ్చారు. 2005లో కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. 2021లో ఆమెకి బ్రేకప్ చెప్పాడు. ఇక తన మాజీ భార్యలిద్దరితోనూ అమీర్ స్నేహబంధాన్ని కొనసాగించడం కొసమెరుపు.