Aamir khan | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రయోగాలు చేసే అతి కొద్ది మంది యాక్టర్ల జాబితాలో ఉంటాడు బీటౌన్ స్టార్ అమీర్‌ఖాన్ (Aamir khan) . కెరీర్లో దంగల్, పీకే లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన ఈ స్టార్ యాక్టర్ చాలా రోజులుగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇదిలా ఉంటే అమీర్‌ఖాన్ మూవీ బిజినెస్ స్ట్రాటజీని మార్చాలని ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
శాటిలైట్, డిజిటల్ రైట్స్ విషయంలో తాజా స్ట్రాటజీని అమలు చేయాలనుకుంటున్నాడట. సాధారణంగా బాక్సాఫీస్ ఫలితం ఆధారంగా ధరలను నిర్ణయిస్తుంటారు. కానీ అలా జరుగడం లేదు. సినిమా విడుదలై థియేటర్లలో స్పందన చూసిన తర్వాత శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్మాలని తన ప్రొడక్షన్ టీంకు సూచించినట్టు బీటౌన్ సర్కిల్ టాక్.
అంతేకాదు ఈ ప్లాన్‌ను తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ సితారే జమీన్ పర్ సినిమాతోనే అమలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అమీర్‌ఖాన్ కొత్త ప్లాన్ కాసులు కురిపించాలని విష్ చేస్తున్నారు సినీ జనాలు.
Nani | నాని-వివేక్ ఆత్రేయ హ్యాట్రిక్ సినిమా.. కొత్త ప్రాజెక్ట్ జోనర్ ఇద
Dil Raju | థంపింగ్ రెస్పాన్స్.. గేమ్ ఛేంజర్‌లో ఎస్జే సూర్య పాత్రపై దిల్ రాజు
Jr NTR | ఒకే ఫ్రేమ్‌లో రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్, తారక్ ఫ్యామిలీ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో..!