Bheemla Nayak | ప్రస్తుత పరిస్థితుల్లో సోలో రిలీజ్ అయితేనే కలెక్షన్స్ రావడం కష్టంగా ఉంది. అలాంటిది పోటీ పడితే అసలుకే నష్టం వస్తుంది. ఈ విషయం దర్శక నిర్మాతలకు బాగా తెలుసు. అందుకే ఒక సినిమా వచ్చినప్పుడు మరో సినిమాను విడుదల చేయడం లేదు. మొన్న సంక్రాంతి సీజన్ కాబట్టి ఒకేసారి మూడు నాలుగు సినిమాలు విడుదల చేశారు. లేదంటే కచ్చితంగా వారానికి ఒక్క సినిమా మాత్రమే విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. అందుకే జనవరి 28న కేవలం కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సఖి మాత్రమే విడుదలైంది. ఇప్పటి నుంచి కూడా రాబోయే ప్రతివారం కేవలం ఒక్క సినిమాను మాత్రమే విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 11న రవితేజ ఖిలాడి సినిమా విడుదల కానుంది. మరోవైపు ఫిబ్రవరి 25న ఆడవాళ్లు మీకు జోహార్లు ( Aadavallu meeku joharlu ) సినిమా విడుదల చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
శర్వానంద్ హీరోగా వరుస విజయాలతో జోరు మీదున్న కిషోర్ తిరుమల ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ముందు ఈ సినిమాను వెంకటేశ్‌తో చేయాలనుకున్నాడు కిషోర్. అయితే అనుకోని కారణాలతో ఆ ప్రాజెక్ట్ శర్వానంద్ చేతుల్లోకి వచ్చింది. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సరైన రిలీజ్ డేట్ కోసం చాలా రోజులుగా వేచి చూస్తుంది. తాజాగా ఫిబ్రవరి 25న సినిమాను విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు. ఇక్కడ విచిత్రమేంటంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కూడా విడుదల కానుంది. పోయి పోయి పవన్ సినిమాతో పోటీ పడాలని ఏ నిర్మాత కూడా కోరుకోడు. అయినా కూడా శర్వానంద్ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు అంటే పవన్ సినిమా వాయిదా పడినట్లే అని అందరూ భావిస్తున్నారు.
ఇప్పటికీ భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న భీమ్లా నాయక్ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. కరోనా కారణంగా పనులు పూర్తి కాకపోవడంతో ఈ సినిమాను మరోసారి వాయిదా వేయాలని చూస్తున్నారు. అందుకే శర్వానంద్ సినిమా ఫిబ్రవరి 25న మహా శివరాత్రి కానుకగా విడుదల కానుంది. సమ్మర్లోనే పవన్ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. భీమ్లా నాయక్‌లో రానా మరో హీరోగా నటిస్తున్నాడు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Bheemla nayak | భీమ్లా నాయక్ ‘కు గుడ్ న్యూస్.. ఏపీలో పెరగనున్న టికెట్ ధరలు..?
భీమ్లా నాయక్‌లో కోతలు భారీగా ఉండబోతున్నాయా.. రన్ టైమ్ అంత తక్కువ!!
తనతో సినిమా చేయాలంటే ఈ కండీషన్ ఫాలో అవ్వాల్సిందే అంటున్న పవన్ కళ్యాణ్
Pawan kalyan | పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు ఊహించని సమస్య..