‘ భీమ్లా నాయక్ ‘కు గుడ్ న్యూస్.. ఏపీలో పెరగనున్న టికెట్ ధరలు..?

Bheemla nayak | కొద్దిరోజుల్లోనే ఏపీలో టికెట్ ధరలు ( AP Movie Ticket Prices ) పెరగబోతున్నాయనే వార్త ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మొన్నటికి మొన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయినప్పుడు కూడా టికెట్ ధరలపై ఆలోచిస్తున్నట్లు జగన్ చెప్పాడు. ఎంత పెరుగుతాయనేది చెప్పకపోయినా.. ఆమోదయోగ్యంగానే అందరికీ ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు మీడియా ముందు తెలిపారు చిరంజీవి. ఇదే విషయంపై ఏపీ ప్రభుత్వం ఒక కమిటీని కూడా నియమించింది. వారు చెప్పిన దాన్ని బట్టి టికెట్ రేట్లు పెంచాలని కోర్టు కూడా నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ ఫిబ్రవరి 2న మరోసారి భేటీ కానున్నారు. అయితే దీనికి సినిమా ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరు కావాల్సి ఉంది.. కానీ ప్రస్తుతం ఆయన కరోనా కారణంగా హోమ్ క్వారంటైన్లో ఉన్నాడు.
దాంతో చిరు ఈ మీటింగ్‌కు హాజరు కావడం లేదు. ఇదిలా ఉంటే ఇదే కమిటీ ఫిబ్రవరి 10వ తేదీన మరోసారి కోర్టు ముందు తమ నివేదిక ఉంచబోతుంది. ఆ రోజే టికెట్ ధరలపై తుది నిర్ణయం రానుంది. ఖచ్చితంగా మునుపటిలా సినిమా ఇండస్ట్రీకి షాక్ ఇచ్చే నిర్ణయాలు ఈసారి ఉండవని.. వాళ్లు సంతృప్తిపడే విధంగానే టికెట్ ధరలు పెరిగిపోతున్నాయని బాగానే ప్రచారం జరుగుతుంది. ఇదేగాని జరిగితే ఫిబ్రవరి 11న విడుదల కాబోయే రవితేజ ఖిలాడి.. ఫిబ్రవరి 25న విడుదల కాబోయే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాల పంట పండినట్లే.
ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నైట్ కర్ఫ్యూ, థియేటర్లలో 50% ఆక్యుపెన్సీ ఆంక్షలు అమలులో ఉన్నాయి. దీనివల్ల కొన్ని కలెక్షన్స్ నష్టపోయే అవకాశం ఉంది. కానీ ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే టికెట్ రేట్లు మళ్లీ పెరిగితే మాత్రం అంతకంటే నిర్మాతలకు కావాల్సింది మరొకటి ఇంకేమీ ఉండదు. 2021 ఏప్రిల్ 8 నుంచి జీవో 35 అమల్లోకి వచ్చింది. దీనివల్ల ఏపీలో టికెట్ల ధరలు దారుణంగా తగ్గాయి. అందుకే పుష్ప, అఖండ అలాంటి సంచలన విజయం సాధించిన సినిమాలు కూడా ఏపీలో బ్రేక్ ఈవెన్ కాలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
భీమ్లా నాయక్‌లో కోతలు భారీగా ఉండబోతున్నాయా.. రన్ టైమ్ అంత తక్కువ!!
Bheemla Nayak | భీమ్లా నాయక్ డేట్ మళ్లీ మారిందా.. ఏకంగా చిరంజీవితోనే పోటీ..?
Pawan kalyan | పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు ఊహించని సమస్య..
తనతో సినిమా చేయాలంటే ఈ కండీషన్ ఫాలో అవ్వాల్సిందే అంటున్న పవన్ కళ్యాణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

