భీమ్లా నాయక్‌లో కోతలు భారీగా ఉండబోతున్నాయా.. రన్ టైమ్ అంత తక్కువ!!

Bheemla Nayak Run Time | కొన్నిసార్లు రీమేక్ సినిమాల విషయంలో ఉన్నదున్నట్లు తీస్తారు. మరికొన్ని మాత్రం మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి తీస్తారు. రాక్షసుడు, దృశ్యం, నారప్ప లాంటి సినిమాలను ఉన్నదున్నట్లు తీస్తేనే బాగుంటుంది. అందులో ఏ మాత్రం మార్పులు చేసినా ఫలితం తేడా కొడుతుంది. కానీ గబ్బర్‌సింగ్ లాంటి సినిమాలకు మాత్రం ఇది వర్తించదు. కేవలం లైన్ తీసుకుని మన ప్రేక్షకులకు తగ్గట్లు మార్పు చేసి తీస్తుంటారు. ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోశీయుమ్ సినిమాకు తెలుగు రీమేక్ పేరుకు రీమేక్ ఇది. అయినా కూడా ఇందులో చాలా వరకు మార్పులు చేర్పులు బాగానే జరిగాయని తెలుస్తోంది.
ముఖ్యంగా త్రివిక్రమ్ వచ్చిన తర్వాత భీమ్లా నాయక్ సినిమా స్క్రిప్టు మొత్తం మారిపోయింది. పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఆయన ఇమేజ్ కోసం కథను కాస్త మార్చేశారని.. ఒరిజినల్ వర్షన్ చూసిన వాళ్లకు కూడా తెలుగు సినిమా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. మలయాళంలో లేని కొన్ని సన్నివేశాలు తెలుగులో అదనంగా యాడ్ చేస్తున్నారు. అలాగే అక్కడ భారంగా అనిపించిన కొన్ని సన్నివేశాలు తెలుగులో తొలగిస్తున్నారు. ఇప్పుడు మరో సంచలన విషయం కూడా బయటికి వచ్చింది. ఒరిజినల్ సినిమా నిడివి దాదాపు రెండు గంటల 40 నిమిషాలు ఉంటుంది. కానీ తెలుగు వెర్షన్ మాత్రం కేవలం 2 గంటల 12 నిమిషాల తోనే వస్తుందని తెలుస్తోంది. ఈ లెక్కన దారుణంగా కోతలు విధించాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఏ మాత్రం బోర్ కొట్టకుండా క్రిస్పీ స్క్రీన్ ప్లే ఈ సినిమాకు రాసేశాడు అని అర్థమవుతుంది. సినిమా అంతా చకచకా అయిపోతుందని ఫస్టాఫ్ కేవలం గంట సేపు మాత్రమే ఉంటుందని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో ఉన్న సినిమాకు ఇంత తక్కువ నిడివి ఉండటం ఒక రకంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. కానీ ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ చూసుకున్న తర్వాత ఇంత నిడివి ఉంటే బాగుంటుందని త్రివిక్రమ్ తన టీమ్ డిసైడ్ చేయడంతో అదే మాట మీద వెళ్లిపోయారు. సినిమా ఫిబ్రవరి 25న శివరాత్రి కానుకగా విడుదల కానుంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
తనతో సినిమా చేయాలంటే ఈ కండీషన్ ఫాలో అవ్వాల్సిందే అంటున్న పవన్ కళ్యాణ్
Bheemla Nayak | భీమ్లా నాయక్ డేట్ మళ్లీ మారిందా.. ఏకంగా చిరంజీవితోనే పోటీ..?
Pawan kalyan | పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు ఊహించని సమస్య..
సమ్మర్ బాట పట్టిన పెద్ద సినిమాలు.. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో!!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

