Bheemla nayak | పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. మలయాళంలో మంచి విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోశీయుమ్ సినిమాకు రీమేక్ ఇది. తెలుగు వర్షన్ కోసం త్రివిక్రమ్ చాలా మార్పులు చేశాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్లు కొన్ని సన్నివేశాలు అదనంగా యాడ్ చేశారు. అలాగే ఒరిజినల్లో ఉన్న మరికొన్ని సన్నివేశాలను ఇక్కడ తీసేశారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు భీమ్లా నాయక్ సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను ముందు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ట్రిపుల్ ఆర్ వస్తుంది అని దీన్ని వాయిదా వేయించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కరోనా రావడంతో అన్ని సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. ఫిబ్రవరి 25న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. శివరాత్రి కానుకగా భీమ్లా నాయక్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే ఇప్పటికీ ఇంకా భీమ్లా నాయక్ షూటింగ్ పూర్తి కాలేదని తెలుస్తోంది. చిన్న చిన్న పనులు పెండింగ్ ఉండగా.. కరోనా కారణంగా అవి వాయిదా పడటంతో సినిమా కూడా మరోసారి పోస్ట్ పోన్ అయ్యేలా కనిపిస్తోంది.
ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 1కి ఈ సినిమాను వాయిదా వేయాలని ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఏప్రిల్ 1న చిరంజీవి ఆచార్య విడుదల కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. ఫిబ్రవరి 4న రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా రెండు నెలలు వాయిదా పడింది. ఇప్పుడు పోయి పోయి అదే రోజు పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అయితే మాత్రం.. మెగా అభిమానులకు అంతకంటే పెద్ద షాక్ మరొకటి ఉండదు. కానీ అన్నాదమ్ములు ఇద్దరూ ఒకేరోజు రావడం దాదాపు అసాధ్యం. కచ్చితంగా నిర్మాతలు కూర్చుని రిలీజ్ డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడం ఖాయం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Pawan kalyan | పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు ఊహించని సమస్య..
భీమ్లా నాయక్ సినిమాలో త్రివిక్రమ్ ప్రధానంగా చేసిన మూడు మార్పులివేనా..
Ramcharan in Acharya | ఆచార్యలో రామ్ చరణ్ నటించడానికి కారణమిదే
సమ్మర్ బాట పట్టిన పెద్ద సినిమాలు.. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో!!