Ramcharan in Acharya | ఆచార్యలో రామ్ చరణ్ నటించడానికి కారణమిదే

Ramcharan in Acharya movie | మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అప్పటి వరకు పరిస్థితులు బాగుంటే సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుంది. లేదంటే మరోసారి వాయిదా పడడం ఖాయం. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని కొన్ని కీలకమైన విషయాల గురించి రామ్ చరణ్ మీడియా ముందు పంచుకున్నాడు. తొలిసారి తండ్రితో కలిసి నటించడం ఆనందంగా ఉందని.. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను అంటున్నాడు చరణ్.

ఆచార్య సినిమాలో సిద్ధ పాత్రలో నటిస్తున్నాడు రామ్‌చరణ్. ఈ క్యారెక్టర్ కోసం తనను తాను చాలా మార్చుకున్నట్లు చెప్పాడు రామ్ చరణ్. ఇందులో తన తండ్రితో పాటు తాను కూడా నక్సలైట్ గా నటిస్తున్నట్లు ఓపెన్ అయ్యాడు చరణ్. కథాపరంగా తాము ఎందుకు నక్సలైట్ గా మారాల్సి వచ్చిందో సినిమా చూస్తే అర్థమవుతుంది అంటున్నాడు మెగా వారసుడు. ఇదిలా ఉంటే ఇందులో తన తండ్రి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని.. ఇప్పటి వరకు ఆయన కెరీర్లో ఇలాంటి క్యారెక్టర్ చేయలేదని చెప్పాడు రామ్ చరణ్. ఇక తన సిద్ధ పాత్ర విషయానికి వస్తే ముందు ఆచార్యలో తాను నటించాలి అనుకోలేదని.. ఈ క్యారెక్టర్ కోసం బయట ఇద్దరు ముగ్గురు నటులను అనుకున్నామని చెప్పాడు చరణ్. కానీ ఎందుకో కుదరలేదు అన్నాడు ఈయన.

ఆ ముగ్గురు నటుల్లో మహేశ్ బాబు కూడా ఉన్నాడు. ఈ విషయం రామ్ చరణ్ కన్ఫమ్ చేయకపోయినా కూడా అప్పట్లో చిరంజీవి, మహేశ్ బాబు కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటూ ఇండస్ట్రీ మొత్తం కోడై కూసింది. కానీ చివరి నిమిషంలో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు మహేశ్. ఆ తర్వాత రవితేజ పేరు కూడా వినిపించింది. చివరికి రామ్ చరణ్ ఆచార్యలో సిద్ధ పాత్ర కోసం ఎంపికయ్యాడు. ఈ కథలో నిన్ను తప్ప వేరే వాళ్ళు ఊహించుకోలేకపోతున్నాను చరణ్.. ఈ కథ విన్న తర్వాత నువ్వే డిసైడ్ చేసుకో అని కొరటాల శివ ఒకరోజు తనకు ఫోన్ చేసి అడిగాడని.. ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న తాను రాజమౌళి పర్మిషన్ తీసుకొని ఆచార్య సినిమాలో నటించినట్లు చెప్పాడు. ఏదేమైనా మెగా అభిమానులకు ఇది అద్భుతమైన ట్రీట్ అంటున్నాడు చరణ్. సినిమా ఎప్పుడు వచ్చిన విజయం సాధించడం ఖాయం అంటున్నాడు. మా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆచార్య అనుకున్న తేదీకి విడుదల అవుతుందా..?
వివాదంలో చిరంజీవి ఆచార్య పాట.. పోలీసులను ఆశ్రయించిన RMPలు..
Chiranjeevi Pan india | ‘ఆచార్య’ విషయంలో అసంతృప్తిగా చిరంజీవి..?
Acharya OTT Partner | ఆచార్య ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా..?
ram charan about chiru advice | నాన్న ఏం సలహా ఇచ్చాడో చెప్పిన రాంచరణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

