ఆచార్య అనుకున్న తేదీకి విడుదల అవుతుందా..?

Acharya release date | కొవిడ్ కారణంగా రావాల్సిన సినిమాలు చాలా వరకు వాయిదా పడ్డాయి. ఇప్పటికే పెద్ద సినిమాలు ఎందుకు రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. షూటింగ్స్ కూడా ఆగిపోయే సరికి అందరూ షాక్‌లోకి వెళ్లిపోయారు. అనుకున్న సినిమాలు ఒక్కటి కూడా రిలీజ్ కావడం లేదు. మరోవైపు సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోతున్నాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా విడుదల తేదీపై కూడా అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 4న ఈ సినిమా విడుదల అవుతుంది అని ఇప్పటికే పోస్టర్స్ రిలీజ్ చేశారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాను నిర్మించింది.

కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈయనకు జోడిగా పూజాహెగ్డే నటిస్తోంది. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమా దేవాలయాల చుట్టూ జరిగే అక్రమాల నేపథ్యంలో సాగుతుంది. ధర్మస్థలి అనే ప్రాంతంలో జరిగే కథ ఇది. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో చిరంజీవితో పాటు రామ్‌చరణ్ కూడా నక్సలైట్లుగా కనిపిస్తున్నారు.

మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మధ్యే విడుదలైన ఐటమ్ సాంగ్ కూడా అదిరిపోయింది. యూట్యూబ్‌లో ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 4న ఆచార్య విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉండబోతున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆచార్య రిలీజ్ డేట్ మారే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. కేవలం ఆచార్య మాత్రమే కాదు ఫిబ్రవరిలో రాబోయే మరెన్నో సినిమాల విడుదల తేదీలు కూడా ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయినట్లు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఇంద్ర సినిమాకు ఒక్కో టికెట్ అంత ధరకు అమ్మారా.. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన బి.గోపాల్
వివాదంలో చిరంజీవి ఆచార్య పాట.. పోలీసులను ఆశ్రయించిన RMPలు..
పవన్ కళ్యాణ్‌ను ఫస్ట్ టైం పవర్ స్టార్ అని ఎవరు పిలిచారో తెలుసా !
chiranjeevi | చిరంజీవికి పేరు లేని సినిమా ఏదో తెలుసా..?
మెగా ఫ్యామిలీ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

