ఇంద్ర సినిమాకు ఒక్కో టికెట్ అంత ధరకు అమ్మారా.. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన బి.గోపాల్

Indra Movie Tickets Price | చిరంజీవి కెరీర్లో ఇంద్ర సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటి వరకూ ఫ్యాక్షనిజం జోలికి చిరంజీవి వెళ్లలేదు. కానీ బాలకృష్ణ కెరీర్లో ఫ్యాక్షన్ సినిమాలు చేసిన మ్యాజిక్ చూసిన తర్వాత.. ప్రత్యేకంగా దృష్టి పెట్టిన చిరంజీవి ఇష్టపడి మరీ రాయించుకున్న కథ ఇంద్ర. చిన్ని కృష్ణ రాసిన ఈ కథ సంచలన విజయం అందుకుంది. దర్శకుడు బి.గోపాల్ తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు ఆ రోజుల్లోనే రూ.30 కోట్ల షేర్ వసూలు చేసింది. 2002లో విడుదలైన ఇంద్ర సినిమా ఆ రోజుల్లోనే 125 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. చిరంజీవి కెరీర్లో అప్పటి వరకు లేనంత కలెక్షన్స్ ఇంద్ర తీసుకువచ్చింది. ఇంద్ర విడుదలైన సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగ వాతావరణం ఏర్పడింది. 20 ఏళ్ల కింద జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి ఇప్పుడు దర్శకుడు బి.గోపాల్ మీడియాతో పంచుకున్నారు.

అప్పట్లో చిరంజీవి సినిమా థియేటర్లో విడుదల అయితే ప్రేక్షకులు ఎగబడేవారు. అభిమానులు పండగ చేసుకునే వాళ్లు. ముఖ్యంగా బ్లాక్ టికెట్ల దందా ఓ రేంజ్లో జరిగేది. ఆ రోజుల్లోనే ఒక్కో టికెట్ 500 రూపాయల వరకూ అమ్మిన చరిత్ర ఉంది. అయితే ఇంద్ర సినిమాకు మాత్రం అది 2 వేల వరకు వెళ్లింది అని చెప్పాడు దర్శకుడు బి.గోపాల్. మదనపల్లిలో ఒక వ్యక్తి పది వేల రూపాయలకు 5 టికెట్లు తీసుకున్నారని తెలిసి షాకయ్యానని అప్పటి సంగతులు ప్రేక్షకులతో పంచుకున్నాడు దర్శకుడు బి.గోపాల్. రాయలసీమ ఫ్యాక్షనిజం సినిమాలు తెరకెక్కించడంలో బి.గోపాల్ అందెవేసిన చెయ్యి. అప్పటికే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలతో బి.గోపాల్ రేంజ్ నంబర్‌వన్‌లో ఉంది. అలాంటి సమయంలో ఇంద్ర కూడా రికార్డులు తిరగరాసింది. అప్పట్లో ఈ సినిమా 175 రోజులు థియేటర్లలో ఆడింది. అందుకే బ్లాక్ టికెట్ ధర కూడా రెండు వేల వరకు ఉంది. ఇందులో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించగా.. ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వివాదంలో చిరంజీవి ఆచార్య పాట.. పోలీసులను ఆశ్రయించిన RMPలు..
ఏపీ టికెట్ల ధరలతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు.. నాగార్జున కీలక వ్యాఖ్యలు..
Tollywood | ఇండస్ట్రీ పెద్ద టాపిక్‌పై సుమన్ కీలక వ్యాఖ్యలు..
Aacharya | ఆ విషయంలో చిరంజీవి, బాలకృష్ణను ఇప్పటి హీరోలు అందుకోగలరా..?
Tollywood | 2022లో ఆ నలుగురు హీరోల ట్రిపుల్ బొనాంజా..
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..
శృతి హాసన్ జోరు.. బాలయ్య తర్వాత మరో స్టార్ హీరో సినిమాలో ఆఫర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

