Aacharya | ఆ విషయంలో చిరంజీవి, బాలకృష్ణను ఇప్పటి హీరోలు అందుకోగలరా..?
saana kashtam | నాగార్జున, వెంకటేష్ డాన్స్‌లు పెద్దగా పట్టించుకోరు. కానీ చిరంజీవి ( Chiranjeevi ) బాలకృష్ణ ( Balakrishna ) అలా కాదు.

Saana kashtam | తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. అందులో కుర్ర హీరోలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా 40 ఏళ్ల లోపు ఉండే స్టార్ హీరోలు దాదాపు 10 మంది ఉన్నారు. అందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ సహా మరో అరడజను మంది ఉంటారు. వీళ్ళందరూ కేవలం నటనలో మాత్రమే కాదు డాన్సుల విషయంలో కూడా అద్భుతాలు చేస్తుంటారు. డాన్స్ దగ్గరికి వచ్చేసరికి ఎవరికీ ఎవరూ తక్కువ కాదు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు డాన్సులకు దూరమై చాలా సంవత్సరాలు అయిపోయింది. వాళ్ల గురించి అభిమానులు అది కోరుకోవడం లేదు కూడా.
స్క్రీన్ మీద వాళ్లు అలా జస్ట్ ఒక చిన్న వాకింగ్ చేస్తే చాలు.. ఈలలు గోలలు వేస్తుంటారు ఫాన్స్. మహేష్, పవన్ కూడా అదే ఫిక్స్ అయిపోయారు. ప్రతి సినిమాలో అదే కంటిన్యూ చేస్తున్నారు. అయితే యంగ్ హీరోల విషయం ఎలా ఉన్నా కూడా సీనియర్ హీరోలు కూడా డాన్సుల విషయంలో తగ్గేదే లే అంటున్నారు.
నాగార్జున, వెంకటేష్ డాన్స్‌లు పెద్దగా పట్టించుకోరు. కానీ చిరంజీవి ( Chiranjeevi ) బాలకృష్ణ ( Balakrishna ) అలా కాదు. వయసుతో సంబంధం లేకుండా వాళ్ళు చేసే డాన్స్ అభిమానులతో కేరింతలు కొట్టిస్తుంది. తాజాగా చిరంజీవి ఆచార్య ( Aacharya )నుంచి ఐటమ్ సాంగ్ విడుదలైంది. అందులో మెగాస్టార్ చేసిన స్టెప్పులు చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు.
66 ఏళ్ల మెగాస్టార్ కుర్ర హీరోలకు పోటీగా డాన్సు చేస్తుంటే.. ఈయన గ్రేస్ ముందు ఇప్పటి హీరోలు ఎవరైనా నిలబడతారా అనే అనుమానాలు ఎవరికైనా వస్తాయి. శానా కష్టం వచ్చిందే మందాకినీ అంటూ మెగా స్టెప్పులతో అలరించాడు చిరంజీవి. మరోవైపు మొన్న అఖండ ( Akhanda ) సినిమాలో జై బాలయ్య మాస్ స్టెప్స్ వేసి అభిమానులతో విజిల్స్ కొట్టించాడు బాలకృష్ణ. ఈయన వయసు కూడా 61 సంవత్సరాలు. ఒకవైపు చిరంజీవి.. మరోవైపు బాలకృష్ణ ఇద్దరు వయసు పట్టించుకోకుండా చేస్తున్న డాన్స్ లు చూసి కుర్ర హీరోలు కూడా భయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Regina Cassandra | ‘ఆచార్య’పైనే ఆశలు..రెజీనాకు కలిసొచ్చేనా..?
Pushpa Deleted Scene | పుష్ప డిలీటెడ్ సీన్ చూశారా? ఈ సీన్‌ను ఎందుకు డిలీట్ చేశారో తెలుసా?
Mohanbabu Letter | ‘మనకెందుకు అని మౌనంగా ఉండాలా..?’ మోహన్ బాబు లేఖ వైరల్
మోహన్ బాబు రాసిన లేఖ ఎవరిని ఉద్దేశించనది?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

