Regina Cassandra | ‘ఆచార్య’పైనే ఆశలు..రెజీనాకు కలిసొచ్చేనా..?
స్పెషల్ సాంగ్ లో కనిపించాక కూడా లీడింగ్ హీరోయిన్లుగా తమ హవా కొనసాగిస్తున్నారు స్టార్ హీరోయిన్లు. ఈ లిస్టులో నేను కూడా ఉన్నానంటూ తాజాగా మరో బ్యూటీ రెజీనా (Regina Cassandra) వచ్చేసింది.

ఒకానొక టైంలో లీడింగ్ హీరోయిన్లుగా కొనసాగిన భామలు ఇటీవల కాలంలో స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం చూస్తూనే ఉన్నాం. రాయ్ లక్ష్మి, కాజల్ (Kajal Aggarwal) , సమంత (Samantha) ఇలా పలువురు హీరోయిన్లు ఈ జాబితాలో ఉన్నారు. స్పెషల్ సాంగ్ తర్వాత వీరి స్టార్ డమ్ కు వచ్చిన ఇబ్బందేమి లేదు. స్పెషల్ సాంగ్ లో కనిపించాక కూడా లీడింగ్ హీరోయి న్లుగా తమ హవా కొనసాగిస్తున్నారు. ఈ లిస్టులో నేను కూడా ఉన్నానంటూ తాజాగా మరో బ్యూటీ రెజీనా (Regina Cassandra) వచ్చేసింది.

ఆచార్య (Acharya) చిత్రంలో ‘సానా కష్టం’ (Saana Kastam) అంటూ చిరంజీవితో హాట్ హాట్ రొమాంటిక్ స్టెప్పులేస్తూ అదరగొట్టేందుకు రెడీ అవుతుందని సాంగ్ ప్రోమో ద్వారా తెలిసిపోతుంది. అయితే కొంతకాలంగా కెరీర్ విషయంలో డీలా పడిపోయిన రెజీనా ఈ సాంగ్ తో తనకు మంచి క్రేజ్ రావడం ఖాయమని భావిస్తుందట. అంతేకాదు ఈ పాట తనకు టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశలు కూడా పెట్టుకున్నట్టు ఇండస్ట్రీ జోరుగా టాక్ వినిపిస్తోంది. తెలుగులో కొంతకాలంగా సరైన బ్రేక్ లేని ఈ భామకు మెగాస్టార్ సినిమా కలిసొస్తుందని పెట్టుకున్న ఆశ నెరవేరుతుందా..? లేదా అనేది చూడాలి.
రెజీనా ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకిని ఢాకిని చిత్రంలో వన్ ఆఫ్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. కొరియన్ మిడ్ నైట్ రన్నర్స్ ఆధారంగా వస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్ మరో లీడ్ రోల్ లో నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

