Tollywood | ఇండస్ట్రీ పెద్ద టాపిక్‌పై సుమన్ కీలక వ్యాఖ్యలు..

Actor Suman | గత కొంతకాలంగా టాలీవుడ్లో ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే విషయంపై టాపిక్ బాగానే జరుగుతుంది. మరీ ముఖ్యంగా మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచిన తర్వాత అతడి వర్గం ఎక్కువగా ఇండస్ట్రీ పెద్ద మోహన్ బాబు అంటూ ప్రచారం చేశారు. మరోవైపు చిరంజీవి వర్గం మాత్రం ఇండస్ట్రీకి ఎప్పుడు ఒక్కడే పెద్ద ఉండాలి.. ఆయన మెగాస్టార్ చిరంజీవి అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం ప్రత్యక్షంగా లేదు.. కానీ పరోక్షంగా మాత్రం చాలానే జరుగుతుంది. రెండు వర్గాలు ఎప్పటికప్పుడు ఎవరికి వారు ఇండస్ట్రీ పెద్ద గురించి మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే రెండు రోజుల కింద మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద టాపిక్ గురించి మాట్లాడాడు. తనకు ఇండస్ట్రీలో పెద్ద అని పిలిపించుకోవాలని లేదని.. అనవసరమైన పంచాయతీల్లో జోక్యం చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పాడు చిరంజీవి. అదే రోజు సాయంత్రం మోహన్ బాబు ఒక లెటర్ విడుదల చేశాడు. ఎంతసేపు మనకెందుకు మనకెందుకు అని ఉండటం మంచిది కాదని.. ఇండస్ట్రీ అనేది ఏ నలుగురు సొత్తు కాదు.. అందరు కలిసి ఉంటేనే అది ఇండస్ట్రీ అవుతుంది అంటూ లేఖ విడుదల చేశాడు ఈయన. ఇది ఖచ్చితంగా చిరంజీవిని ఉద్దేశించి ఆయన ఇలా రాశాడు అంటూ సోషల్ మీడియాలో చర్చ బాగా జరిగింది. ఇప్పుడు ఇదే విషయంపై సీనియర్ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇండస్ట్రీ పెద్ద టాపిక్ గురించి సీనియర్ నటుడు సుమన్ మాట్లాడాడు.
నిజానికి దాసరి నారాయణరావు బతికున్నప్పుడు.. ఆయన కాకుండా మరొకరిని ఇండస్ట్రీ పెద్ద అని ఎవరూ అనలేదు. ఆ టాపిక్ ఎప్పుడూ రాలేదు కూడా. ఎవరికి ఏ అవసరం వచ్చినా వెంటనే దాసరి దగ్గరికి పరుగులు తీసే వాళ్లు. కానీ ఆయన మరణించిన తర్వాత ఇండస్ట్రీ పెద్ద గురించి చర్చ ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు సుమన్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో పెద్ద అంటూ ఎవరో ఒకరే ఉండరు అని.. అందరిలోనూ ఐక్యమత్యం ఉండాలి అని చెబుతున్నాడు. మన హీరోలలో ఐకమత్యం లేదు అంటే తాను ఒప్పుకోను అని.. కృష్ణ, కృష్ణంరాజు మురళీ మోహన్ లాంటి పెద్దలు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి అంటున్నాడు. ఏ ఒక్కరికి పెద్దరికం కట్టబెట్టడం మంచిది కాదు అని.. అందరూ కూర్చొని ఇండస్ట్రీకి ఏది బాగుంటుందో ఆలోచించుకోవాలి అంటున్నాడు సుమన్. ఇలా మాట్లాడుకుంటే సినిమా టికెట్ల విషయం కూడా పరిష్కారం అవుతుంది అని ఆయన చెప్పాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | ఆ హోదా నాకు వద్దు : చిరంజీవి
Mohan Babu | నా మౌనం చేతకానితనం కాదు : మోహన్‌బాబు
RGV | అలా చేస్తే మాకు డబ్బులు.. మీకు ఓట్లు.. ఏపీ ప్రభుత్వానికి ఆర్జీవీ ప్రశ్నలు
Varma Tickets Issue | చర్చకు తెరలేపిన వర్మ..ఇండస్ట్రీ పెద్దలు స్పందిస్తారా..?
టాలీవుడ్ హీరోల కోసం విలన్స్ అవుతున్న పరభాషా హీరోలు..
Akhanda | ఇప్పటికే ఓటిటిలో రావాల్సిన ‘అఖండ’ ఇంకా ఎందుకు రాలేదు..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Chiranjeevi
- mohan babu
- pitop
- suman
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

