ఏపీలో టికెట్ ధరల (Ap Tickets Issue) అంశం కొంతకాలంగా సినీ ఇండస్ట్రీ (Telugu Cinema industry)లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ విషయంపై పలువురు హీరోలు కామెంట్స్ చేయగా..దానికి పలువురు మంత్రుల రియాక్షన్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఇక డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) మాత్రం తనదైన స్టైల్లో ఉదాహరణలు చెబుతూ ఏపీలో టికెట్ ధరల (Ap Tickets Issue) అంశంపై నెట్టింట్లో వీడియోలు పెడుతున్నాడు. టికెట్ల ధరల విషయంపై జనాలకు ఓ అవగాహన ఉండాలని చెప్తున్నా అంటూ సందేశాలు పోస్ట్ చేస్తున్నాడు వర్మ.
టికెట్ల ధరల సమస్యపై ఇండస్ట్రీ సహచరులు తమ మనసులో ఉన్న మాటలు బయటపెట్టాలని నా ప్రార్థన కాదు ..డిమాండ్. మీరిప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పుడు తెరవలేరు మీ కర్మ అంటూ ట్వీట్ పెట్టి టాలీవుడ్ ప్రముఖులను అలర్ట్ చేశాడు వర్మ. ఏపీ సినిమాటోగ్రాఫీ మంత్రి పేర్ని నాని (perni nani)కి ఈ విషయంపై ట్వీట్లు కూడా చేశాడు వర్మ. అంతకుముందు ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరల సమస్యను పరిష్కరించేందుకు కొత్త వ్యూహాన్ని రూపొందించాలని వర్మ సూచించాడు.
It is not my request, but it is my demand to all my colleagues in the film industry to speak up on their true feelings about the ticket rates issue because ippudu nollu moosukunte inkeppatikee theravaleru ..Tharvatha Mee kharma
— Ram Gopal Varma (@RGVzoomin) January 4, 2022
ప్రభుత్వం నిర్మాతల నుండి టికెట్లను కొనుగోలు చేసి వాటిని పేద వర్గాలకు తక్కువ ధరలకు విక్రయించే విధంగా ఒక ప్రణాళికను రూపొందించాలని వర్మ సూచనలు చేశాడు. ఏపీలో టిక్కెట్ ధరలపై ట్వీట్ల వర్షం కురిపిస్తూ వర్మ మరోసారి బహిరంగ చర్చకు తెర లేపగా..మరి దీనిపై సినీ పరిశ్రమలోని ప్రముఖులు, పెద్దలు స్పందిస్తారా..? లేదా ? అన్నది తెలియాల్సి ఉంది.