Ram Gopal Varma | ఇడ్లీ హోటల్‌కు సినిమా టికెట్ రేట్లకు వర్మ లింక్..సెటైరికల్ విశ్లేషణ
ఏపీలో ప్రభుత్వం సినిమా టికెట్ రేట్ల (AP Ticket Rates)ను తగ్గించిన నేపథ్యంలో కొంతకాలంగా అక్కడ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు క్లిష్టపరిస్థితులు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. రాంగోపాల్ శర్మ (Ram Gopal Varma) ఈ విషయంపై స్పందిస్తూ ట్విటర్ లో వీడియో పోస్ట్ చేశాడు

ఏపీలో ప్రభుత్వం (AP Government) టికెట్ రేట్ల (AP Ticket Rates)ను తగ్గించిన నేపథ్యంలో కొంతకాలంగా అక్కడ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు క్లిష్టపరిస్థితులు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ శర్మ (Ram Gopal Varma) ఈ విషయంపై స్పందిస్తూ ట్విటర్ లో వీడియో పోస్ట్ చేశాడు.
సినీ ఇండస్ట్రీ (Cinema Industry)కి చెందిన ఒక వ్యక్తిగా..ఏపీలో టికెట్ రేట్ల అంశంపై అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరముంది కనుక మాట్లాడుతున్నానంటూ విశ్లేషణ షురూ చేశాడు వర్మ. ఒక మ్యానుఫాక్చర్ ఒక వస్తువును తయారుచేస్తాడు..ఆ తర్వాత వినియోగదారుడికి అమ్మేందుకు ఏదో ఒక రేట్ పెడతాడు. అది తనకు అయిన ఖర్చా..? లేదా అతడు స్పెషల్‌గా తన టాలెంట్‌తో ఏదైనా యాడ్ చేశాడా..? ఎక్కువగా ఎవరికీ దొరకనిదా..? లేదా ఇతర విషయాల ఆధారంగా అతడొక ధర పెట్టుకుంటాడు. వినియోగదారుడు ఆ ధర నచ్చితే..కొట్టాడు లేకపోతే కొనడు. అది వారిద్దరి మధ్య ఉన్న అంశం. ఒకవేళ బదిలీ జరిగిందంటే సంబంధిత పన్ను ప్రభుత్వ ఖాతాలోకి వెళ్తుంది. దీనికన్నా వేరేది యాడ్ కావడానికి ఆస్కారం లేదన్నాడు వర్మ.
ఉదాహరణకు ఒక ఇడ్లీ హోటల్ ఉంటుంది. ఇడ్లీ ప్టేట్ 50 రూపాయలు అనుకోండి. పక్కనే మరో వ్యక్తి హోటల్ పెట్టి ..తాను చేసిన ఇడ్లీ ఎవరూ చేయలేదు..మా అమ్మ నేర్పించింది..అంటూ ప్లేట్ ఇడ్లీకి 500 పెట్టాడనుకోండి. అతడు ఏ విషయంలో 500 పెడుతున్నాడనేది పాయింట్ కాదు. 50 రూపాయలు కొనే చోట 500 పెట్టి కొంటే అప్పుడు ఆ ఇడ్లీకి విలువ ఉంటుంది. ఇడ్లీ కొనకపోతే గన్ తో షూట్ చేస్తానని 500 రేటు పెట్టిన వ్యక్తి చెప్పడు. నాకు ఆకలేసినపుడు దాబాలో తినొచ్చు.హోటల్లో తినొచ్చు. బండిమీద తినొచ్చు..ఫైవ్ స్టార్ హోటల్లో కూడా తినొచ్చు..ఎక్కడైనా ఆకలి కోసమే. కానీ ఫైవ్ స్టార్ హోటల్లో మీకెందుకు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నరు. వాళ్లు ఆ అనుభూతినిస్తున్నారు. అది లాబీయా, కట్లరీయా, ఎక్స్, ఐ, జెడ్ ఏదైనా కావొచ్చు. మీ దగ్గర స్థోమత ఉంటే అక్కడికెళ్లి తింటారు. లేదంటే బండీ దగ్గరకు వెళ్లి తింటారు. ఇదంతా ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం మీదేన్నాడు వర్మ.
ఇదే ఉదాహరణ నేను ప్రభుత్వానికి టికెట్ రేట్ల మీద పెట్టినపుడు ఎలా ఉంటుందన్నాడు వర్మ. తెలుగు సినిమాకు 100 కోట్ల మార్కెట్ ఉందనుకుంటున్న రోజుల్లో రాజమౌళి, శోభు యార్లగడ్డ 200 కోట్లు పెట్టి సినిమా తీశారనుకుంటే ఎందుకు తీస్తారది..వాళ్లు డబ్బులు పోగొట్టుకోవడానికి కాదు కదా అంటూ ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపుపై వర్మ తనదైన స్టైల్లో చేసిన సెటైరికల్ విశ్లేషణ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

