బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ముంబైకి సమీపంలోని పన్వేల్ ఫామ్‌హౌస్‌లో డిసెంబర్ 25న పాము కాటుకు గురైన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్‌ను వెంటనే సూపర్ స్టార్ వెంటనే ఆసుపత్రికి తరలించగా…అయితే విషరహిత పాము కావడం (Snake Bite)తో కొన్ని గంటల్లోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు సల్మాన్. ఆ తర్వాత సల్మాన్ తన స్నేహితులు, సన్నిహితులతో కలిసి 56వ పుట్టినరోజు జరుపుకున్నాడు. సోషల్‌మీడియాలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) పెట్టే సెటైరికల్, ఫన్నీ పోస్టులకు ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
సల్మాన్ పాము కరిచిన ఘటనపై వర్మ తనదైన స్టైల్లో ఇటీవలే పెట్టిన ఫన్నీ పోస్ట్ నెట్టింట్ట హల్ చల్ చేస్తోంది. ఈ ఘటనను సల్మాన్‌ఖాన్ హిట్ అండ్ రన్ కేసుతో పోల్చుతూ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఓ కార్టూన్‌ను షేర్ చేసుకున్నాడు. ఆకుపచ్చ రంగులో ఉన్న పాము కోర్టు విచారణ బోనులో ఉంది. సల్మాన్‌ఖాన్‌ను కరిచిన పాము ఇదే అని ఆ పోస్టర్లో రాసి ఉంది. కాటేసిందెవరు అని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు…‘అది నేను కాదు…నా డ్రైవర్’ అని చెప్పినట్లు కార్టూన్లో కనిపిస్తుంది.
— Ram Gopal Varma (@RGVzoomin) December 29, 2021
హిట్ అండ్ రన్ కేసు విచారణ సమయంలో సల్మాన్ ఖాన్ చెప్పిన మాటను గుర్తు చేస్తూ ఫన్నీగా పెట్టిన ఈ పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతోంది.