టాలీవుడ్ హీరోల కోసం విలన్స్ అవుతున్న పరభాషా హీరోలు..
Balakrishna new movie | పక్క భాషల్లో స్టార్ హీరోలు కూడా ఇక్కడికి వచ్చి విలన్ అవుతుంటారు. తాజాగా బాలకృష్ణ సినిమా విషయంలో ఇదే జరుగుతుంది.

TBalakrishna new movie | తెలుగు ఇండస్ట్రీ రేంజ్ ఏంటి అనేది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ నటించడానికి చాలా మంది నటులు ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారి తెలుగులో బ్రేక్ వస్తే చాలు ఇక్కడే ఫిక్స్ అయిపోవచ్చు. పైగా రెమ్యునరేషన్స్ పరంగా కూడా తెలుగులో అగ్రతాంబూలం ఇస్తుంటారు. పరభాషా నటులు అయినా కూడా మన ఇండస్ట్రీలో నెత్తిన పెట్టుకుంటారు. అందుకే పక్క భాషల్లో స్టార్ హీరోలు కూడా ఇక్కడికి వచ్చి విలన్ అవుతుంటారు. తాజాగా బాలకృష్ణ సినిమా విషయంలో ఇదే జరుగుతుంది.
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న సినిమాలో కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ విలన్ అవుతున్నాడు. దీని గురించి అధికారిక సమాచారం బయటికి వచ్చింది. బాలయ్య సినిమాలో నటించడానికి విజయ్ భారీ పారితోషికం అందుకుంటున్నాడు. కన్నడలో ఈయనకు యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు ఉంది. పుష్ప ది రూల్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. ముందు ఈ సినిమాలో బాబీ సింహా, విజయ్ సేతుపతి లాంటి పేర్లు పరిశీలించిన తర్వాత ఫహాద్ ను తీసుకున్నారు. ఈయనకు మలయాళంలో మంచి మార్కెట్ ఉంది. అక్కడ వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. అలాంటి హీరో ఇప్పుడు తెలుగులో విలన్ అవుతున్నాడు.
ఇక విజయ్ సేతుపతి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. మాస్టర్ లో విలనిజం పీక్స్ చూపించాడు. తెలుగులో ఉప్పెన సినిమాతో తనదైన ముద్ర వేసాడు విజయ్. ఇక కన్నడలో సూపర్ స్టార్ గా వెలిగిపోతున్న సుదీప్.. తెలుగులో ఈగతో భయపెట్టాడు. దాంతో పాటు విజయ్ పులి.. సల్మాన్ దబంగ్ 3 సినిమాల్లో కూడా విలన్ గా నటించాడు సుదీప్. భోజ్ పురిలో సూపర్ స్టార్ గా వెలిగిపోతున్న రవికిషన్ తెలుగులో విలన్ గా నటించాడు. రేసుగుర్రంతో ఈయన అదిరిపోయే ఇమేజ్ తెచ్చుకున్నాడు. దాంతో పాటు చాలా సినిమాలు చేసాడు రవికిషన్. సునీల్ శెట్టి లాంటి హీరోలు తెలుగులో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.
పదేళ్ల కిందే ఆర్యలో కూడా తెలుగులో విలన్ అయ్యాడు. అల్లు అర్జున్ వరుడు సినిమా కోసం ఈయన కరుడు కట్టిన విలన్ గా నటించాడు. బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ కూడా ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాలో విలన్ గా నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా తమ భాషల్లో సూపర్ స్టార్స్ గా వెలిగిపోతున్న హీరోలు.. తెలుగులోకి వచ్చి విలన్స్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్లకు హీరోలుగా అందే పారితోషికం కంటే కూడా ఇక్కడ విలన్ గా ఎక్కువ అందుకుంటారు.
ఇవి కూడా చదవండి..
ఆ విషయంలో చిరంజీవి, బాలకృష్ణను ఇప్పటి హీరోలు అందుకోగలరా..?
Regina Cassandra | ‘ఆచార్య’పైనే ఆశలు..రెజీనాకు కలిసొచ్చేనా..?
Pushpa Deleted Scene | పుష్ప డిలీటెడ్ సీన్ చూశారా? ఈ సీన్‌ను ఎందుకు డిలీట్ చేశారో తెలుసా?
Mohanbabu Letter | ‘మనకెందుకు అని మౌనంగా ఉండాలా..?’ మోహన్ బాబు లేఖ వైరల్
మోహన్ బాబు రాసిన లేఖ ఎవరిని ఉద్దేశించనది?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

