Chiranjeevi | ఆ హోదా నాకు వద్దు : చిరంజీవి
Chiranjeevi | సినీ ఇండస్ట్రీ పెద్దగా తాను ఉండబోనని అన్నారు అగ్రనటుడు చిరంజీవి. పెద్దరికం అనే హోదా తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో సినీ కార్మికులకు హెల్త్‌కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో చిరంజీవి

సినీ ఇండస్ట్రీ పెద్దగా తాను ఉండబోనని అన్నారు అగ్రనటుడు చిరంజీవి. పెద్దరికం అనే హోదా తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో సినీ కార్మికులకు హెల్త్‌కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో చిరంజీవి పై వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరూ లేరని, ఆ బాధ్యతను తీసుకోవాల్సిందిగా చిరంజీవిని సినీ కార్మికులు కోరారు. వారి కోరికపై స్పందించిన చిరంజీవి పెద్దరికం అనే హోదా తనకు ఇష్టం లేదని చెప్పారు. ఆయన మాట్లాడుతూ ‘ఇండస్ట్రీకి పెద్దగా నేను ఉండను. ఆ పదవి నాకు అవసరం లేదు. బాధ్యత కలిగిన కళామతల్లి బిడ్డగా కష్టాల్లో ఉన్న కార్మికులను ఆదుకునేందుకు అవసరం వచ్చినప్పుడు ముందుకొస్తా. అనవసర విషయాల్లో తలదూర్చను. వ్యక్తులు, యూనియన్ల మధ్య ఉండే వివాదాలు, తగవులు తీర్చాలని నా వద్దకు వస్తే ఆ పంచాయతీ చేయను. కార్మికుల ఆరోగ్యం, ఉపాధికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తూ వారి కోసం నిలబడతా’ అన్నారు. కరోనా ప్రతి ఒక్కరి జీవితాలపై తీవ్రమైన దుష్ప్రభావం చూపిందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వల్ల అరోగ్యం ఎంతో ప్రధానమైనదని సుస్పష్టంగా తెలిసివచ్చిందన్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని సినీకార్మికుల జీవితాలకు కాపాడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టామని చెప్పారు.
Read Today's Latest Entertainment News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ T20I | న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

