Akhanda | ఇప్పటికే ఓటిటిలో రావాల్సిన ‘అఖండ’ ఇంకా ఎందుకు రాలేదు..?
మంచి వసూళ్లు తీసుకొస్తుంది అఖండ. ఇది నిజంగా చాలా మందికి అర్థం కాని చిక్కుప్రశ్న. ఈ రోజుల్లో రెండు వారాలు గడిచిన తర్వాత మూడో వారంలో కలెక్షన్స్ తీసుకురావడం
Akhanda | నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా అఖండ. డిసెంబర్ 2 న విడుదలైన ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. పెద్ద సినిమా విడుదల చేస్తే థియేటర్స్ కు జనాలు వస్తారా రారా అనే అనుమానాలు పూర్తిగా తొలగించిన మొదటి హీరో బాలకృష్ణ. సినిమా విడుదలై నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ వీకెండ్స్ మంచి వసూళ్లు తీసుకొస్తుంది అఖండ. ఇది నిజంగా చాలా మందికి అర్థం కాని చిక్కుప్రశ్న. ఈ రోజుల్లో రెండు వారాలు గడిచిన తర్వాత మూడో వారంలో కలెక్షన్స్ తీసుకురావడం అరుదుగా జరుగుతుంది.

అలాంటిది బాలకృష్ణ సినిమా నాలుగు వారాల తర్వాత కూడా మంచి షేర్ తీసుకొస్తుంది. ఇప్పటికే అఖండ 71 కోట్ల షేర్ వసూలు చేసింది. అందులో తెలంగాణలో ఏకంగా 20 కోట్ల షేర్ ఉంది. బాలకృష్ణ కెరీర్ లోనే మొదటిసారి ఒక సినిమా నైజాంలో 20 కోట్ల మార్కును అందుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమా 150 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జనవరి 2-3 తేదీల్లోనే అఖండ సినిమా ఓటిటిలో విడుదల కావాల్సి ఉంది. కానీ సినిమాకు ఇప్పటికి కూడా మంచి కలెక్షన్స్ వస్తుండడంతో నిర్మాతలు ప్రత్యేకంగా హాట్ స్టార్ డిస్నీ నిర్వాహకులతో మాట్లాడి సంక్రాంతి పండక్కి ఓటీటీ రిలీజ్ ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికీ మంచి షేర్ వసూలు చేస్తుంది ఈ సినిమా. నాలుగో వారం కూడా మూడు కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది అఖండ. అందుకే సినిమా ఓటిటి రిలీజ్ డేట్ వాయిదా వేయించారు. దీనివల్ల హాట్ స్టార్ బాగానే నష్టపోతుంది. ఈ నష్టాన్ని నిర్మాతలు భరిస్తారా లేదంటే ఓటీటీ సంస్థ భరిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం కంటే పొడగించాలి అంటే నిర్మాతలు కొంత మొత్తం ఓటిటి సంస్థకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

