వివాదంలో చిరంజీవి ఆచార్య పాట.. పోలీసులను ఆశ్రయించిన RMPలు..

saana kastam song from Acharya | ఈ మధ్య ఏ సినిమా విడుదల అవుతున్న కూడా ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీ కాకుండా ఉండటం లేదు. ప్రతి సినిమాకు ఇది ఆనవాయితీగా మారిపోయింది. మొన్నటికి మొన్న పుష్ప సినిమాలో సమంత నటించిన ఐటమ్ సాంగ్‌పై ఏపీలో నానా రచ్చ జరిగింది. అందులో ఉన్న లిరిక్స్ మగజాతిని అవమానించేలా ఉన్నాయని పురుష సంఘం సీరియస్ అయింది. వెంటనే ఆ పదాలు మార్చాలి అంటూ దర్శక నిర్మాతలను డిమాండ్ చేశారు. అయితే సోషల్ మీడియాలో దీనిపై ట్రోలింగ్ బాగానే జరిగింది. ఐటమ్ సాంగ్స్ అంటే అలాగే ఉంటాయి.. భక్తి పాటలు ప్రవచనాలు కాదు కదా అవి అంటూ కొంతమంది సెటైర్లు కూడా వేశారు. తాజాగా చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా విషయంలో కూడా ఇలాంటి వివాదమే ఒకటి ఎదురైంది.

ఆచార్య సినిమా నుంచి తాజాగా ఒక ఐటెం సాంగ్ రిలీజైంది. ఈ పాటలో చిరంజీవితో కలిసి రెజీనా చిందేసింది. శానా కష్టం అంటూ సాగే ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. యూట్యూబ్ లో మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తున్నాయి. అయితే తాజాగా ఈ పాటలోని కొన్ని లిరిక్స్‌పై వివాదం చెలరేగుతోంది. ఈ పాటలో “ఏడేడో నిమరోచ్చని కుర్రాళ్లు ఆర్ఎంపీలు అయిపోతున్నారే” అనే లైన్ ఉంది. అంటే రెజీనా లాంటి అమ్మాయిని ముట్టుకునే అవకాశం కోసం ఆర్ఎంపీ డాక్టర్లు అవుతున్నారని అర్థం వచ్చేలా ఉందా లిరిక్. దీనిపై ఆర్ఎంపీ డాక్టర్లు సీరియస్ అవుతున్నారు. తమ వృత్తిని అవమానించేలా ఈ పాటలోని పదాలు ఉన్నాయంటూ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జనగామ ఆర్ఎంపీ వైద్యుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ పాట రాసిన రచయిత, సినిమా తీసిన దర్శకుడిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి దీనిపై ఆచార్య చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మణిశర్మ స్వరపరిచిన ఈ మాస్ సాంగ్ ఇన్స్టంట్ హిట్ అయింది. ఈ పాటను సీనియర్ రైటర్ భాస్కరభట్ల రవికుమార్ రచించారు. రేవంత్, గీతా మాధురి ఆలపించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Regina Cassandra | ‘ఆచార్య’పైనే ఆశలు..రెజీనాకు కలిసొచ్చేనా..?
Aacharya | ఆ విషయంలో చిరంజీవి, బాలకృష్ణను ఇప్పటి హీరోలు అందుకోగలరా..?
Pushpa in OTT | RRR డేట్‌ను బ్లాక్ చేసిన పుష్ప.. ఓటీటీలో వచ్చేది అప్పుడే
మోహన్ బాబు రాసిన లేఖ ఎవరిని ఉద్దేశించనది?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

