తనతో సినిమా చేయాలంటే ఈ కండీషన్ ఫాలో అవ్వాల్సిందే అంటున్న పవన్ కళ్యాణ్

Pawan kalyan Condition | పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నాడో చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి రెండూ కాదు కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 5 సినిమాలకు సైన్ చేశాడు పవర్ స్టార్. రాబోయే రెండేళ్లు పూర్తిగా బిజీగా ఉన్నాడు. మధ్యలో కరోనా రావడంతో అనుకున్న ప్లాన్స్ వర్క్ ఔట్ కావడం లేదు కానీ లేదంటే ఈ పాటికి పవన్ కళ్యాణ్ నుంచి రెండు మూడు సినిమాలు విడుదలై ఉండేవి. ఇలా ఉంటే తన దగ్గర సినిమా చేయాలి అనుకునే దర్శక నిర్మాతలకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. అలాగే కొన్ని కండిషన్స్ అప్లై అంటున్నాడు పవన్ కళ్యాణ్.
పవన్ ప్రస్తుతం భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో భీమ్లా నాయక్ విడుదలకు సిద్ధంగా ఉంది. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు కూడా సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. వీటితో పాటు హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాలకు కమిట్ అయ్యాడు పవన్ కళ్యాణ్. వీటి షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. త్వరలోనే ఈ సినిమాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా భవదీయుడు భగత్ సింగ్. ఈసారి ఎంటర్టైన్మెంట్ విత్ మెసేజ్ వస్తున్నాడు పవర్ స్టార్. ఈయన రాజకీయ ఇమేజ్ కూడా దృష్టిలో పెట్టుకుని కథ సిద్దం చేశాడు హరీశ్ శంకర్.
మరోవైపు సురేందర్ రెడ్డి సినిమా జూన్ తర్వాత మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల దర్శక నిర్మాతలకు పవన్ కళ్యాణ్ పెట్టిన కండీషన్ 60 రోజుల్లో సినిమా పూర్తి చేయమనడం. తాను ఒక్క సినిమాకు కేవలం 60 రోజులు మాత్రమే డేట్స్ ఇస్తానని.. ఈ రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలి అని కండీషన్ పెడుతున్నాడు పవన్. ఇది నిజంగా సూపర్ కండీషన్. ఒకవేళ ఇది అప్లై చేసి 60 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి చేస్తే అంతకంటే కావాల్సింది మరొకటి లేదు. ఎందుకంటే ఆరునెలల్లో సినిమా విడుదలవుతుంది. అయితే డైరెక్టర్లకు సెట్ అయ్యే డేట్స్ను పవన్ కళ్యాణ్ ఇవ్వగలడా లేదా అనేదే ఇక్కడ అసలు సమస్య. మొత్తానికి చూడాలిక ఏం జరగబోతుందో.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Bheemla Nayak | భీమ్లా నాయక్ డేట్ మళ్లీ మారిందా.. ఏకంగా చిరంజీవితోనే పోటీ..?
Pawan kalyan | పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు ఊహించని సమస్య..
DSP in Pawan kalyan Movie | పవన్ కళ్యాణ్ కోసం నటుడిగా మారిన దేవి శ్రీ ప్రసాద్..?
పవన్ కళ్యాణ్తో శ్యామ్ సింగరాయ్ 2 తీస్తా.. రాహుల్ సాంకృత్యన్ సెన్సేషన్ కామెంట్స్
పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ ఆర్మీ.. పవర్స్టార్ను పొగడ్తలతో ముంచెత్తిన నిధి అగర్వాల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

