DSP in Pawan kalyan Movie | పవన్ కళ్యాణ్ కోసం నటుడిగా మారిన దేవి శ్రీ ప్రసాద్..?

DSP in Pawan kalyan movie | తెలుగు ఇండస్ట్రీలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌కు ఉన్న ఫాలోయింగ్ చూసి కొంతమంది హీరోలు కూడా కుళ్లుకుంటారు. పేరుకు మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా హీరోలకు ఏమాత్రం తీసిపోని ఇమేజ్ ఎంజాయ్ చేస్తున్నాడు DSP. అందుకే ఈయనను హీరో చేయాలనే ఆలోచన కూడా చాలా మంది నిర్మాతలు, దర్శకులు చేశారు. ఆ మధ్య సుకుమార్ అయితే ఏకంగా తన దర్శకత్వంలో దేవి శ్రీ ప్రసాద్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు కూడా. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాలనుకున్నాడు. అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పటికే కొన్ని సినిమాల్లో అలా తళుక్కున మెరిసి మాయమయ్యాడు దేవిశ్రీప్రసాద్. కానీ గుర్తుండిపోయే పాత్ర మాత్రం ఇప్పటివరకు చేయలేదు. అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాలో డీఎస్పీ ఒక కీలక పాత్రలో నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
పవన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. అందులో భీమ్లా నాయక్ విడుదలకు సిద్ధమైంది. హరిహర వీరమల్లు సినిమా సగం షూటింగ్ పూర్తయింది. వీటి తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించబోతుంది. గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కీలక పాత్రలో నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. కథను మలుపు తిప్పే అత్యంత కీలకమైన పాత్ర ఇది అని.. దేవిని ఈ పాత్ర కోసం దర్శకుడు హరీశ్ ఒప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఠాగూర్ సినిమాలో వీవీ వినాయక్ తరహా పాత్ర ఇది అని తెలుస్తుంది. ఒకవేళ ఈ సినిమాలో క్యారెక్టర్ క్లిక్ అయితే దేవి నటుడిగా కూడా బిజీ అవ్వడం ఖాయం. సమ్మర్ తర్వాత సినిమా షూటింగ్ మొదలు కానుంది. 2023 సమ్మర్లో భవదీయుడు భగత్ సింగ్ విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Pawan kalyan | పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు ఊహించని సమస్య..
భీమ్లా నాయక్ సినిమాలో త్రివిక్రమ్ ప్రధానంగా చేసిన మూడు మార్పులివేనా..
Ramcharan in Acharya | ఆచార్యలో రామ్ చరణ్ నటించడానికి కారణమిదే
సమ్మర్ బాట పట్టిన పెద్ద సినిమాలు.. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో!!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

