న్యూఢిల్లీ: వృద్ధుల కోసం బ్యాంకులు ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) పథకాలను ప్రవేశపెట్టాయి. ఈ ఆఫర్ ఈ నెలాఖరు వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈ స్కీమ్‌ల్లో చేరిన వృద్ధులకు సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్లలో కంటే ఎక్కువ వడ్డీరేటు లభిస్తుంది.
మీరు వృద్ధులైతే, సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్లో కంటే ఎక్కువ వడ్డీ పొందాలని భావిస్తే ఈ నెలలోనే ఇన్వెస్ట్ చేయండి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంకు ఈ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను ప్రవేశపెట్టాయి. అవేంటో ఓ లుకేద్దాం..
సీనియర్ సిటిజన్ల కోసం స్కీమ్ ప్రారంభించిన స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకానికి వృద్ధుల సంరక్షణ ఎఫ్డీ అని పేరు పెట్టింది. ఐదేండ్ల నుంచి 10 ఏండ్లలో గడువు మధ్య ఎఫ్డీ చేస్తే అదనంగా 0.75 శాతం వడ్డీ అందిస్తున్నది.
ఐదేండ్ల గడువు గలవాటిపై సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే అదనంగా 0.50 % వడ్డీ అందచేస్తున్నది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 5.50% వడ్డీ అందిస్తుంది. ఈ స్పెషల్ స్కీమ్ కింద గరిష్ఠంగా 6.25% వడ్డీ లభిస్తుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇటీవలే సీనియర్ సిటిజన్ల కోసం న్యూ డిపాజిట్ పథకం ప్రారంభించింది. దీనికి ఎస్బీఐ వుయ్ కేర్ అని పేరు పెట్టింది. దీనికింద మరింత వడ్డీ వస్తుంది. దీన్ని రిటైల్ టర్మ్ డిపాజిట్ సెగ్మెంట్ కింద ప్రారంభించింది.
వుయ్ కేర్ పథకం కింద అదనంగా 0.80% వడ్డీ ఆఫర్ చేస్తున్నది ఎస్బీఐ. ఈ పథకం కింద కేవలం బ్యాంకు ఖాతాదారులకు మాత్రమే చేరే వీలు కల్పించింది. నిర్దిష్ఠ గడువులోనే ఈ పథకం కింద డబ్బు మదుపు చేయొచ్చు. ప్రస్తుతం ఎఫ్డీలపై ఎస్బీఐ గరిష్ఠంగా 5.40% వడ్డీ ఆఫర్ చేస్తున్నది.
ఐసీఐసీఐ బ్యాంక్ వృద్ధుల కోసం గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ ప్రారంభించింది. దీని కింద మదుపు చేసిన సొమ్ముపై అదనంగా 0.80% వడ్డీ అందిస్తుంది. ప్రస్తుతం 5-10 ఏండ్ల మధ్య గడువు గల ఎఫ్డీలపై ఐసీఐసీఐ బ్యాంక్ కింద అత్యధికంగా 5.50% వడ్డీ ఆఫర్ చేస్తున్నది.
ఈ పథకం కింద ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వృద్ధులు గరిష్ఠంగా 6.30 శాతం వడ్డీ పొందొచ్చు. ఐదేండ్ల నుంచి 10 ఏండ్లలోపు వరకు ఈ పథకం కింద రూ.2 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. రెన్యూవల్ చేసిన పథకానికి ఈ వడ్డీరేటు వర్తిస్తుంది.
సీనియర్ సిటిజన్లు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంక్ ఆఫ్ బరోడా అదనంగా ఒక శాతం వడ్డీ అందిస్తున్నది. ఐదేండ్ల నుంచి 10 ఏండ్ల గడువు వరకు ఎఫ్డీ చేయవచ్చు. ఈ పథకం ఈ నెలాఖరు వరకు అమలులో ఉంటుంది. ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీలపై 3.3 నుంచి 6.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది.
జూన్ 30 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను పొడిగించిన పేటీఎం…
ఎస్బీఐ కస్టమర్లకు గమనిక.. ఆ పత్రాలు సమర్పిస్తేనే సేవలు
రాష్ట్ర ప్రభుత్వానికి 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు
తమిళనాడులో మరో వారం లాక్డౌన్ పొడగింపు
చరిత్రలో ఈరోజు : ఐదుగురిలో తొలిసారి ఎయిడ్స్ గుర్తింపు
ట్విటర్‌కు చివరి హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం
కొవిడ్ కిట్ లో కరోనిల్ : పతంజలి ప్రతిపాదన వ్యతిరేకించిన ఐఎంఏ
ఢిల్లీ అన్‌లాక్.. సరి, భేసి విధానంలో మాల్స్, మార్కెట్లకు అనుమతి
వెంకయ్య ఖాతాకు బ్లూటిక్ రీస్టోర్ చేసిన ట్విటర్
జైసల్మేర్ జిల్లాలో పవర్‌గ్రిడ్ ఆక్సిజన్ ప్లాంటు…
ఆరెస్సెస్ చీఫ్ భగవత్ ట్విట్టర్ బ్లూటిక్ రిమూవ్, అయితే!
ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చార్జీలు.. ఏ బ్యాంకులో ఎంత అంటే …?