Work From Home End @TCS | దేశంలోనే అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగుల వర్క్ ఫ్రం హోం (డబ్ల్యూఎఫ్‌హెచ్) ముగిసింది. సోమవారం నుంచి సంస్థ ఉద్యోగులంతా తాము పని చేస్తున్న కేంద్రాల్లో రిపోర్ట్ చేశారు. గతేడాది కరోనా మహమ్మారిని నియంత్రించడానికి ఉద్యోగులకు ప్రారంభంలోనే వర్క్ ఫ్రం హోం విధానాన్ని తీసుకొచ్చిన సంస్థల్లో టీసీఎస్ ఒకటి. ఇంతకుముందు సగం మంది ఉద్యోగులనైనా ఆఫీసులకు రావాలని కోరింది. 2025 నాటికి ఉద్యోగుల్లో 25 శాతం మంది మాత్రమే ఆఫీసుల్లో విధులు నిర్వర్తించే విధానానికి ఇప్పటికే టీసీఎస్ రూపకల్పన చేసింది. ప్రాజెక్ట్ అనుబంధ ఉద్యోగులు 25 శాతం మాత్రమే ఆఫీసు విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.
వర్క్ ఫ్రం హోం విధానంతో తమ కస్టమర్లు సౌకర్యవంతంగా ఉన్నారని, ఇతరులకు సాధ్యం కానీ ఈ మోడల్‌తో మరింత వర్క్ చేయడానికి వెసులుబాటు లభిస్తుందని టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపినాథన్ చెప్పారు. కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 5.29 లక్షల మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు.
25/25 మోడల్ పనివిధానానికి మళ్లడానికి ముందు ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ ముగిసే సమయానికి తమ ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి విధులు నిర్వర్తించేలా ప్రోత్సహిస్తున్నాం. ప్రతి టీం లేదా ప్రాజెక్ట్ అవసరాలకు అనుగుణంగా సిబ్బంది తమ టీమ్ లీడర్లతో సంప్రదిస్తూ దశల వారీగా అనువైన రీతిలో పని చేయడానికి ప్రోత్సహిస్తున్నాం. ఉద్యోగులు పూర్తిగా ఆఫీసులకు రావడం ప్రారంభమైన తర్వాత క్రమంగా 25/25 మోడల్‌కు వెళతాం అని టీసీఎస్ ఓ ప్రకటనలో తెలిపింది.
గతవారం వరకు టీసీఎస్‌లో కేవలం ఐదు శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఆఫీసులకు వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. తమ సిబ్బందిలో 70 శాతం రెండు డోస్‌లు, 95 శాతం మంది సింగిల్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారని ఇంతకుముందు టీసీఎస్ ప్రకటించింది.
ఉద్యోగులు ఆఫీసుకు రావడానికి, యాజమాన్యాలు తమ సిబ్బందిని ఆఫీసులకు ఆహ్వానించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని ఇండస్ట్రీ బాడీ నాస్కామ్, జాబ్ పోర్టల్ ఇండీడ్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. అదే సమయంలో హైబ్రీడ్ మోడల్ పాలసీకి మొగ్గుతున్నారు. 2022 ప్రారంభం నుంచి 50 శాతానికి పైగా సిబ్బంది వారానికి మూడు రోజులు ఆఫీసుల నుంచి విధులు నిర్వర్తించడానికి మొగ్గుచూపుతున్నారు. 70 శాతం కంపెనీల ఉద్యోగులు హైబ్రీడ్ మోడల్‌కే ప్రిపరెన్స్ ఇస్తున్నారు. ఐటీ సర్వీసులు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు దీర్ఘకాలిక హైబ్రీడ్ వర్క్ మోడల్ విధానాన్ని అమలు చేసేందుకు సన్నద్ధం అవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
jagadguru adi shankaracharya | ఆదిశంకరుడికి జీవంపోసిన అరుణ్ యోగిరాజ్
Diwali special | పిలక లేని కొబ్బరికాయను దేవుడికి కొడితే ఏమవుతుంది?
ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?
లక్ష్మీదేవి 8 రూపాల వెనుక ఆంతర్యమిది.. దీన్ని అర్థం చేసుకుంటే సిరిసంపదలకు కొదవ ఉండదు
తులసీదాసు భరోసా హనుమాన్ చాలీసా