Stock Market | వారంలో రెండోరోజైన మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో సానుకూల ప్రవనాలతో మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. రియాల్టీ మినహా అన్నిరంగాల్లో అమ్మకాలు కనిపించాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్.. 81,492.50 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే సూచీలు నష్టాల్లోకి జారుకుతున్నాయి. ఇంట్రాడేలో 81,774.23 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్.. అత్యల్పంగా 80,575.09 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. చివరగా 636.24 పాయింట్లు పతనమై.. 80,737.51 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 174.10 పాయింట్ల నష్టంతో 24,542.50 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్లో దాదాపు 1,701 షేర్లు లాభపడగా.. 2,148 షేర్లు పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం తగ్గింది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది. రియాల్టీ ఇండెక్స్ ఒకశాతం పెరిగింది.
Read Also : WhatsApp | వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి సూపర్ ఫీచర్..!
బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, ప్రైవేట్ బ్యాంక్, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు 0.5-1 శాతం తగ్గాయి. నిఫ్టీలో అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్సర్వ్, అదానీ ఎంటర్ప్రైజెస్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ నష్టపోగా.. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, బజాజ్ ఆటో, సిప్లా లాభపడ్డాయి. ఇదిలా ఉండగా.. నిఫ్టీ బ్యాంక్ ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి 56,161 పాయింట్లను తాకింది. మరో వైపు మంగళశారం ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. బీఎస్ఈలో 100కి పైగా స్టాక్‌లు 52 వారాల గరిష్ట స్థాయికి చేరాయి. ఇందులో గార్డెన్ రీచ్, రాడికో ఖైతాన్, దీపక్ ఫెర్టిలర్స్, ఆథమ్ ఇన్వెస్ట్మెంట్, సోలార్ ఇండస్ట్రీస్, భారతి హెక్సాకామ్, సిటీ యూనియన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, ఇంటెలెక్ట్ డిజైన్, ఇండియన్ బ్యాంక్ ఉన్నాయి. ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ షేర్లు ఐపీఓ ధర కంటే 19శాతం ప్రీమియంతో లిస్టింగ్ అయ్యాయి. బీఎస్ఈలో 20.05 శాతం పెరిగి రూ.126.05 వద్ద ముగిశాయి.
Read Also : Microsoft | మైక్రోసాఫ్ట్‌లో మరో రౌండ్ లేఆఫ్‌లు.. 300 మంది తొలగింపు