WhatsApp | ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న యాప్‌లో వాట్సాప్ ఒకటి. కోట్లాది మంది యూజర్లను దృష్టిలో పెట్టుకొని మెటా యాజమాన్యంలోని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేస్తూ వస్తున్నది. తాజాగా సరికొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌ను పరీక్షిస్తున్నది. దాని సహాయంతో యూజర్లు సొంతంగా కస్టమ్ ఏఐ చాట్‌బాట్‌ను సృష్టించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్ల కోసం విడుదల చేయగా.. త్వరలోనే మిగతా యూజర్లు అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ ఫీచర్ ఇప్పటికే ఇన్స్టాగ్రామ్, మెసెంజర్లో అందుబాటులో ఉన్నది. యూజర్లు వారి చాట్‌బాట్ ఉద్దేశం, వ్యక్తిత్వం, లుక్‌ని సైతం డిజైన్ చేసుకోవచ్చు.
చాట్‌బాట్ సిద్ధమయ్యాక యూజర్లు ఒకరితో ఒకరు సంభాషించుకునే వీలు సైతం ఉన్నట్లు సమాచారం. WABetaInfo నివేదిక ప్రకారం.. మెటా ఇప్పుడు ఏఐ స్టూడియో ఆధారిత చాట్‌బాట్ క్రియేషన్ ఫీచర్‌ను వాట్సాప్‌కు జోడిస్తున్నది. ఈ ఫీచర్ ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్ వెర్షన్ 2.25.18.4 వాట్సాప్ బీటాలో కనిపించింది. ఈ అప్డేట్లో కొందరు యూజర్లు కోసం ‘క్రియేట్ ఎన్ ఏఐ’ అనే ఫీచర్ కనిపించింది. ఈ ఫీచర్లో యూజర్లు కొత్త ఏఐ స్టూడియో ట్యాబ్ ఉంటుంది. ఇందులో ముందు రెడీగా ఉన్న చాట్బాట్లు అందుబాటులో ఉంటాయి. దాంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. లేదంటే కస్టమ్ ఏఐ చాట్‌బాట్‌ను సైతం తయారు చేసుకోవచ్చు.
కస్టమ్ చాట్‌బాట్‌ను తయారు చేసుకునేందుకు ముందుగా ప్రాంప్ట్ రాయాల్సి ఉంటుంది. యూజర్లు మీ ఏఐ చాట్‌బాట్ ఉద్దేశం, రోల్‌ను తెలిపేలా గరిష్టంగా వెయ్యి అక్షరాలలతో వివరణ ఇవ్వాలి. అలాగే, వ్యక్తిత్వ లక్షణాలు ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం వాట్సాప్ పలు సూచనలు ఇస్తుంది. కానీ, యూజర్లు సైతం ఓన్ చాయిస్ కూడా ఉంటుంది. ఆ తర్వాత మీ చాట్‌బాట్ రోల్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే హెల్పర్, మెంటర్, టీచర్ తదితర రోల్‌ని ఎంచుకొని.. ఆ తర్వాత అవరాత్ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తయ్యాక ఏఐ స్టూడియో కొత్త చాట్‌బాట్‌ను రూపొందిస్తుంది. ఆ తర్వాత వెంటనే మీరు మాట్లాడుకోవచ్చు. వాట్సాప్ యూజర్లు తమ చాట్బాట్లను ఇతరులతో షేర్ చేసుకోవచ్చా? లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇన్స్టాగ్రామ్, మెసెంజర్లో షేర్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఈ ఫీచర్ త్వరలోనే వాట్సాప్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా దశలో ఉండగా.. బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
Read Also :
Microsoft | మైక్రోసాఫ్ట్‌లో మరో రౌండ్ లేఆఫ్‌లు.. 300 మంది తొలగింపు
త్వరలో ఎవరూ ఊహించని స్థాయికి బంగారం ధరలు..