Nirav Modi | పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ… తనను భారత్‌కు అప్పగించవద్దని కోరుతూ అప్పీల్ దాఖలు చేసేందుకు లండన్ హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో లెటర్ ఆఫ్ ఇండెంట్ పేరిట రూ.13,500 కోట్ల మోసానికి పాల్పడి.. నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే.
తర్వాత లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న నీరవ్ మోదీని బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాటి నుంచి జైలులోనే మగ్గుతున్న నీరవ్ మోదీ.. తన మానసిక ఆరోగ్యం, మానవ హక్కుల ఉల్లంఘన నేపథ్యంలో భారత్‌కు అప్పగించొద్దని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు.
తీవ్ర నిరాశానిస్ప్రుహల్లో చిక్కుకున్న నీరవ్ మోదీ ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. ముంబైలోని ఆర్టూర్ రోడ్ జైలులో ఆత్మహత్యాయత్నాలను నివారించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జస్టిస్ మార్టిన్ చంబేర్లియన్ విచారణ జరిపారు.
Covid Antibodies: వైరస్ సోకిన ఏడు నెలల తర్వాతా పుష్కలంగా యాంటీబాడీలు!
Kokari Robbery : చరిత్రలో ఈరోజు.. కాకోరి రైలు దోపిడీకి 96 ఏండ్లు
Italy Century Village : సెంచరీలు దాటించే ఊరు మాది..!
Vivo Y53s : వివో నుంచి సరికొత్త ఫోన్.. 20 వేల లోపు ధరలో అద్భుతమైన ఫీచర్లతో
pegasus row: ఎన్ఎస్వో గ్రూప్‌తో ఎలాంటి లావాదేవీలు జరుపలేదు: రక్షణ శాఖ