న్యూఢిల్లీ, జూలై 6: టీవీఎస్ మోటర్.. మార్కెట్లోకి సరికొత్త ఎన్‌టార్క్ 125 సీసీ రేస్ ఎక్స్పీ స్కూటర్‌ను విడుదల చేసింది. మంగళవారం పరిచయమైన దీని ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం రూ.83,275గా ఉన్నది. డ్రైవ్ మోడ్స్, 10.2 హెచ్‌పీ పవర్, వాయిస్ అసిస్ట్, టెక్నాలజీ కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.