న్యూఢిల్లీ : సవాళ్లతో కూడిన ఆర్ధిక అనిశ్చితి వెంటాడుతున్నా దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS) పెద్దసంఖ్యలో ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్కు మొగ్గుచూపింది. ఈ ఏడాది తాము క్యాంపస్ ప్లేస్మెంట్స్ను చేపట్టడం లేదని ఇన్ఫోనిస్ వంటి ఐటీ కంపెనీలు చెబుతుండగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకునేందుకు సన్నాహాలు చేపట్టామని టీసీఎస్ సీవోవో గణపతి సుబ్రమణియం స్పష్టం చేశారు.
టీసీఎస్ ఏటా 35,000 నుంచి 40,000 మంది నూతన ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటుంది. ఇక ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్కు తోడు కంపెనీలో భారీ లేఆఫ్స్‌కు ఎలాంటి ప్రణాళికలూ లేవని చెప్పడం టెకీలకు ఊరట కలిగిస్తోంది. ఫ్రెషర్స్ హైరింగ్‌లో టీసీఎస్ ముందుకెళుతుండగా ఇన్ఫోసిస్ వంటి పలు ఐటీ కంపెనీలు ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
గత ఏడాది తాము 50,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకున్నామని, ఇక డిమాండ్ ఊపందుకునే వరకూ క్యాంపస్ హైరింగ్ చేపట్టబోమని ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో నీలంజన్ రాయ్ ఇటీవలి ఎర్నింగ్స్ కాల్లో పేర్కొన్నారు. ఇక మార్కెట్ పరిస్ధితులకు అనుగుణంగా రిక్రూట్మెంట్ విషయంలో టీసీఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని కంపెనీ సీవోవో సుబ్రమణియం పేర్కొన్నారు.\
Read More :